21, సెప్టెంబర్ 2010, మంగళవారం

నేను ఇవాళ బ్లాగులు తిరగేస్తుండగా ఒక బ్లాగు నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది

నేను ఇవాళ బ్లాగులు తిరగేస్తుండగా
ఒక బ్లాగు నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది
అది ఇక్కడ చూడండి
 నేను కొన్ని విషయాలు చెప్తాను గమనించండి ఆ పై మీ విమర్శలు విసరండి.
ఈ లింక్ లో చెప్పబడిన ప్రకారం, మరియు ఇక్కడ
ప్రపంచంలో ఉన్న ఏ మొహమ్మదీయుడు ప్రస్తుతం బాబ్రీ మసీదు ను కూల్చివేసిన ఆ ప్రదేశాన్ని నమాజ్ కు వాడరాదు.
ఎంచేతనంటే అదే ప్రదేశంలో ఒక వేళ రామాలయం అంతకు ముందు వుండిన అది హరాం అవుతుంది.
హజ్ చేసే సమయాల్లో కొన్ని ప్రదేశాల్లో నమాజ్ చదవడం నిషిద్ధంగా చెప్పబడి ఉంది, ఎందుకని అంటే ఆయా ప్రదేశాల్లో  ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహివసల్లం) గారి కంటే ముందు రోజుల్లో మూర్తి పూజ చేయబడేది. ఇతర కారణాల వల్ల కూడా కొన్ని ప్రదేశాల్లో నమాజ్ నిషిద్ధం, ఉదాహరణకు: ఇతర మతాలకు సంబంధించిన వస్తువుల ఉన్న ప్రదేశం గానీ, రుద్రభూమి(స్మశానం), బలులు, పూజలు ఇతరత్రా తంత్రాలు చేసిన ప్రదేశాల్లో, అశుద్ధ ప్రదేశాల్లో.
మరి బాబర్ సమయంలో పూర్తిగా అప్పటి హిందూ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడానికో లేక మరే కారణం చేతనో బాబ్రీ మసీదు కట్టబడింది, సరే, అది వేరే విషయం అప్పట్లో కాళ్ళకు పాదరక్షలు కూడా తీయకుండా నమాజు చదివేవారు, మద్యం మత్తులో నమాజు చదివేవారు కొందరు, అస్సలు నమాజు చదవని వారు కొందరు. అది పక్కన పెడితే  అ ప్రామాణిక గ్రంథమయిన ఖురాన్ ప్రకారమే చూద్దాం : ఆజ్ఞ ప్రకారం యూదులు, క్రైస్తవుల ధార్మిక ప్రదేశాలకు వెళ్ళటం కూడా తప్పుగా చూపబడింది.
మరి బాబ్రీ మసీదు కట్టక ముందు అక్కడ దేవాలయం ఉందని ఋజువు చేస్తే ఆ ప్రదేశం లో నమాజు చదవటానికి మాత్రం "ఖురాన్ ను నమ్మే ఏ ముస్లిం" కూడా ఒప్పుకోడు. దాన్ని అత్యంత హేయమైన చర్యగా భావిస్తాడు.
కానీ ఎంత మంది ముహమ్మదీయులు నేడు ఖురాన్ ను అనుసరిస్తున్నారు?
ఎంత మంది నమాజ్ చదువుతున్నారు?
అక్కడ రామ మందిరం కట్టాలా వద్దా అన్నది ప్రతి భారతీయుడికీ తెలుసు.
కానీ అక్కడ మసీదు కట్టడం నిషిద్ధం అని ఎంత మంది కి తెలుసు?
ఇంత రాద్ధాంతం చేస్తున్న నాయాకులు, సొంత రాజకీయాల కోసమే ముస్లిమ్ లను ప్రేరేపిస్తున్నారు.
ఇందులో మతగురువులను కూడా భాగస్వాములుగా చేస్కున్నారు.
అటువంటి తరుణంలో ఇటువంటి కుళ్ళు రాజకీయాలకు నేను బలవ్వను. పైవడు ఏది ఎల జరగలని   అనుకుంటాడో అదే జరుగుగాక.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి