17, నవంబర్ 2011, గురువారం

తొలి కలల ప్రేమలేఖ



ప్రణయభావం హృదయ సంబంధి. నిండు నూరేళ్ల జీవితానికి రసాలందించే ఆ ప్రేమఫలం చవిని పసగల రెండు మూడు పదాల్లో పొదగాలంటే ఎంత అనుభవం కావాలి? 'ప్రేమంటే ఒక తికమకలే. అది వేధించే తీపి కలే' అన్నాడో ఓ సినిమా కవి. ఎద సడిని సరిగమపదనిసలుగా మలచి పాడే ఆ గడసరి- పిడికిలంత గుండెలో కడలిని మించిన హోరును పుట్టించగల జగడాలమారి. 'మ్రొక్కి మొక్కించుకొనునట్టి చక్కదనము/పొగిడి పొగిడించుకొనునట్టి ప్రోడతనము/దక్కి దక్కించుకొనునట్టి దంటతనము/ దానికేకాక కలదే యే చానకైనా?' అని ముద్దుపళనివారి మాధవుడు తలపోసింది రాధిక గురించే. నిజానికి ఆ శాపనార్థాలన్నీ అన్యాపదేశంగా అశరీరుడి ఆగడాలమీద గురిపెట్టిన శరాలే! సదా గోపాలపాద చింతనామగ్న అయిన గోపకాంత ఒకతె చెంతవాలిన చంచరీకాన్నే ప్రియుడు పంపిన ప్రేమదూతగా భావించుకొని ఆలపించిన భ్రమరగీతాలూ ఈ ధోరణిలోనే సాగే తంతు. తనను మన్మథ వేదనపాలు చేసిన విధాత నిర్దయను వ్రేపల్లె గొల్లభామ పడ తిట్టిపోస్తుంది- పోతన భాగవతంలో. 'కత్తిలేని ఒరకు కాంతి లేనట్టుగా ప్రేమలేక యున్న బ్రతుకు సున్న' అని దాశరథి వంటి కవులు భావిస్తూనే ఉన్నారంటే ఆ కొంటెతనమంతా ఈ మిటారితనంలోనే ఉందనేగా! 'ప్రణయ వధువు నొక రాతిరి త్రాగినాను/ప్రళయ దినము దాక నిషా వదలదు నన్ను' అంటూ పారశీక గజల్ కవి మీర్ పదాలు పాడింది ఈ పాడు తీపి ప్రణయ మధువు గమ్మత్తు మత్తు గురించే!

ప్రేమంటే మోకాలి లోతు దుఃఖం. పీకల దాకా సుఖం. ముల్లు ముల్లుకీ మధ్యనే పువ్వు విచ్చుకున్నట్లు, పువ్వు పువ్వుకీ మధ్య ముల్లూ పొడుచుకొని ఉంటుంది. ప్రేమలో కన్నీళ్లు వద్దనుకుంటే ఎలా? మెరుపు లేకుండా, చినుకు రాకుండా చిగురు పుడుతుందా? రాధికా సాంత్వనంలోని కథానాయిక బాధే ఏ మదన పీడితులకైనా. 'కంటికి నిద్రరాదు, వినుకాంతుని బాసిన నాటి నుండియున్/వంటకమింపు గాదు, పెఱవార్తలు వీనుల సోకలేదు నే/డొంటిగ బ్రొద్దుపోదు, మరులూరక యుండనీదు, తొల్లినే/జంట బెనంగు వారిగన జాలక చాల కరంగ గంటినో' అంటూ పెంపుడు చిలుక ముందు కంటనీరు పెట్టుకొంటుంది రాధిక ఒంటరి తుంటరి ఒంటిబాధ భరించలేక. సుభద్రను తొలిరేయి సమాగమానికి స్వయంగా అలంకరించి భర్త వద్దకు పంపిన తాళ్ళపాక తిమ్మక్కవారి 'ద్రౌపది'దీ అదే హృదయ వేదన. 'విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా!' అంటూ పింగళి వంటివారు ఎంత వూరించినా నండూరివారి నాయుడు బావకిలా గుండె గొంతుకలో కొట్లాడుతుండే కూకుండనిస్తుందా కూసింతసేపు?! 'ఒక ముద్దుకోసం యుగాలైనా ఆగుతాను/ తన పొందుకోసం యోజనాలు సాగుతాను' అని బీరాలు పలికే ప్రేమదాసులు మూడుముళ్లు పడితేచాలు... తొలి రేయిదాకానైనా తాళలేరు. 'ఆలుమగల మధ్యగల ఆ అనుబంధం కాలం గడిచేకొద్దీ బలమైన స్నేహబంధంగా మారితేనే ఆ సంసారం సరస సుధాసారం... ఆ జంట లోకం కనులపంట' అంటాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. ఈ తరం యువతరం తొందరపాటు, కలిసి నడవడంలోని తడబాటు, నూతన దంపతుల్లోని ఎడబాటును మరింత వేగంగా పెంచుతోందని మానసిక శాస్త్రవేత్తలిప్పుడు ఆందోళన చెందుతున్నారు.

'ఆమె కడలి తీరపు దీపం. కాకపోతే... అతను సంసార సాగరంలో జాడ తెలియని ఓడ. అతను సాగర హృదయ వైశాల్యం కాకపోతే ఆమె సంగమ సాఫల్యం అందని నదీసుందరి' అంటాడొక ఆధునిక కవి. ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో కుమారీ శతకం ఏనాడో తెలియజెప్పింది. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు తల్లిలా, పవళింపు సేవలో రంభలా, ఆలోచనల వేళ మంత్రిగా, సేవించేటప్పుడు దాసిగా మెలగాలంటుంది. మరి, భర్త ఎలా ఉండాలి? ఆలుమగలు ఆకాశం, భూమిలాగా- హృదయవైశాల్యం, సహన సౌశీల్యం అలవరచుకుంటేనే ఆ దాంపత్యం వాగర్ధ ప్రణయైకమత్యమంత ఆదర్శప్రాయమవుతుంది. 'ఆత్మ సమానత్వం పొందిన జీవిత భాగస్వామి ముందు మోకరిల్లటం ఆత్మనమస్కారమంత ఉత్తమ సంస్కారం' అని కదా మల్లినాథహరి కిరాతార్జునీయంలోని ఒక ఉపకథాసారం! 'పొందనేర్తునె నిన్ను పూర్వజన్మ / కృతసుకృత వైభవమున దక్కితివి నాకు' అని ఆమె అనుకోవాలి. 'ఎంత మాధుర్యమున్నదో యెంచగలనె! / సలలిత కపోల నీ మృదుసూక్తిలోన' అని అతను మనస్ఫూర్తిగా భావించి పైకి అనాలి. పెళ్ళినాటి సప్తపదిలో ముందు నాలుగడుగులు వధువు వరుణ్ని నడిపిస్తే, మిగిలిన మూడడుగులు వరుడు వధువు చేయిపట్టుకొని నడిపించేవి. పెళ్ళిపీటల మీద అగ్నిసాక్షిగా పరస్పరం చేసుకొన్న ప్రమాణాలు కాళ్ల పారాణి పచ్చదనం తడి ఆరకముందే నేటితరానికి మరపునకు రావడం విచారకరం. పెరుగుతున్న విడాకులకు విరుగుడుగా పొరుగున చైనాలోని బీజింగ్ తపాలాశాఖ ప్రేమలేఖల చిట్కా ప్రవేశపెట్టింది. మూడుముళ్లు పడిన మరుక్షణంలోనే వధూవరులు తమ జీవిత భాగస్వాముల మీదున్న ప్రేమనంతా ఒలకబోసి రాసిన ప్రేమలేఖలను ఆ శాఖవారు భద్రపరచి ఏడేళ్ల తరవాత తిరిగి ఇస్తారట! పెళ్ళినాటి ప్రమాణాలు మళ్ళీ గుర్తుకొచ్చి ఎడబాటు ఆలోచనలు తగ్గుముఖం పడతాయన్నది వారి సదాలోచన. కలకాలం కలిసే ఉండాలన్న కోరికలు మరింత బలపడితే శ్రీ గౌరీశ్వర సాన్నిహిత్యంలా వారి దాంపత్యం కళకళలాడుతుందన్న ఆలోచనే హర్షణీయం. అందమైన సంసారాలను ఆశించే వారందరికీ అది ఆచరణీయం.

మతి పోయిందా పరకాలా సార్?



ప్రపంచం మారుతోంది…జనాలు చదువులు నేర్చుకుంటున్నారు..ఐటీలనీ కంప్యూటర్లనీ సెల్ ఫోన్లనీ అనేక రకాల ఉద్యోగ అవకాశాలతో..
సామాన్య జనం ఓ స్థాయికి చేరుకుంటున్న సమయంలో…
రాజకీయ నిరుద్యోగి రెచ్చగొట్టుడు తో మేమెక్కడ వెనకపడిపోతామో అని మిగతా పార్టీల సన్నాసి నాయకులందరూ.. వెధవలందరూ… జనానికి ఎంతో కష్టపడి తెలంగాణా విషాన్ని సక్సస్ ఫుల్ల్ గా ఎక్కించాక…
ఈ పరకాల ప్రభాకర్ ఎవరండీ…జనాల్లో తెలంగాణా సెంటిమెంట్ లేదంటాడు?
ఈ రాజకీయనాయకులందరూ జనాల మెదళ్ళను విషపూరితం చేశారని ఈ పెద్ద మనిషికి తెలియదా??
ఈ రాజకీయులందరి బ్రతుకు తెరువు ఇప్పుడు జై తెలంగాణా అనక తప్పదని తెలీదా??టీవీ ల ముందు రంకెలేస్తున్న తెలంగాణా నాయకులకు ఇప్పుడు వెనక్కు వెళ్ళే దిక్కు లేక అరుస్తునారన్న విషయం ఈ పరకాలకు తెలియదా??
ఈ డిమాండ్లేవీ తెలంగాణా ప్రజలను ఉద్దరించడానికి కాదని…వాళ్ళ ఉనికి కోసమేననీ ఈ ఈ పరకాలకు తెలియదా??
వీళ్ళు కలుగ చేసిన భ్రమలకు వందలాది జనాలు ఆత్మహత్యలు చేసుకుంటే…ఆ నంబరు చూపించి ఈ నాయకులు ప్రతీ సారీ టీవీ ల ముందు జనాన్ని మరింత రెచ్చగొడుతున్నారని తెలియదా??మరి ఈ నాయకుల పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోరో??వెర్రి భాగుల జనమే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారో పరకాలకు…తెలియదా??
ఉదయం లేస్తే తమ బ్రతుకు తెరువు కోసం జనం రోడ్డు మీదకు వస్తారుగానీ…ఉద్యమాలకోసం కాదని పరకాల వేరే చెప్పాలా??
ఉద్యమాలకోసం…ఆ పేరుతో వచ్చేది మన సన్నాసి రాజకీయనాయకులే కదా??ఉద్యమాల పేరుతో జనాన్ని రెచ్చగొడితే…ఓట్లూ..పదవులూ…ఓహో…ఆ భోగమే వేరుకదా…కేసీఆర్ కుటుంబాన్ని చూడండీ….ఉద్యమమ్ పేరుతో ఎంత తమాషా నడిపిస్తాడో?ఈ తతంగమంతా తెలీకనా మన ప్రభాకరుడు…అదేదో గొప్ప ఉద్యమమ్గా గుర్తించి సవాలు చేయడం??

11, అక్టోబర్ 2011, మంగళవారం

అమెరికా సైనికుల శాడిజం ఇలా ఉంటుంది


౧)అమెరికా సైనికులు పిల్లలకి నీళ్ళ సీసా ఇస్తామని ఆశ చూపి లారీ వెనకాల పరిగెత్తిస్తున్న దృశ్యం
౨)అమెరికా సైనికుల ఇరాకీ పిల్లల చేత ఇరాక్‌కి వ్యతిరేకంగా అశ్లీల గీతం పాడిస్తున్న దృశ్యం. ఫక్ ఐరాక్ అంటే ఏమిటో ఆ ఇరాకీ పిల్లలకి తెలియదు. దాన్ని అవకాశంగా తీసుకుని ఇరాకీ పిల్లల చేత అశ్లీల గీతం పాడించారు.

రెండు చపాతీల కోసం అశుద్ధాన్ని చేతితో ముట్టుకునే దుస్థితిలో గుజరాతీ పాకీ పనివాళ్ళు

గుజరాత్ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందనీ, గుజరాత్‌లో అవినీతి లేదనీ గుజరాత్ పాలనని వీరోచితంగా పొగిడేస్తున్నారు కొందరు కార్పొరేట్ మీడియావాళ్ళు. గుజరాత్‌లోని దామాపూర్ గ్రామంలో ఐదు వాల్మీకీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి చెందిన ఎనిమిది మంది మహిళలు లెట్రిన్‌లు కడిగే వృత్తిలోనే ఉన్నారు. వాళ్ళు నూటపదిహేను కుటుంబాలకి చెందిన లెట్రిన్‌లు కడుగుతారు. ఆ కుటుంబాలు ముస్లింలు, ఠాకూర్‌లు & బ్రాహ్మణులకి చెందినవి. ఈ నూటపదిహేను కుటుంబాలకి చెందినవాళ్ళకి తమ లెట్రిన్‌లు తాము శుభ్రం చేసుకోవడానికే అసహ్యం కలిగినప్పుడు వీళ్ళ లెట్రిన్‌లని శుభ్రం చెయ్యడానికి ఇతరులకి ఎంత అసహ్యం కలగాలి? ఈ లింక్ చదవండి:http://www.countercurrents.org/rawat210311.htm ఎవరి అశుద్ధాన్ని వాళ్ళే కడుక్కోవాలని తెలియనివాళ్ళు నాగరిక సమాజంగా చెప్పుకునే సమాజంలో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదా? తెల్ల చొక్కా వేసుకున్న డబ్బున్నవాడు రోడ్డు పక్కన పేడ చూస్తేనే అసహ్యపడిపోతాడు. అటువంటప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి ఉపయోగించిన లెట్రిన్‌లో చెయ్యి పెట్టాలంటే ఇంకెంత అసహ్యం కలగాలి? పాకీవాళ్ళూ మనుషులే కానీ బతకడానికి వేరే దారి లేక రెండు చపాతీల కోసం అశుద్ధాన్ని ముట్టే స్థితిలో ఉన్నారు. ఇంకో విచిత్రమేమిటంటే తమది స్వేచ్ఛాసహోదరత్వవాద మతం అని చెప్పుకునే ముస్లింలు పాకీ వృత్తిని సమర్థించడం! ఇంత అనారోగ్యకరమైన వాతావరణంలో స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది, సహోదరత్వం అనే పదానికి అర్థం ఎక్కడ ఉంటుంది?

2, ఆగస్టు 2011, మంగళవారం

సినిమానే సర్వస్వమా?


ఆలోచించగా, ఈమధ్య కాలంలో అంతా సినిమామయంగానే కనబడ్తోంది నాకు. ఏ టీవీ ఛానెల్ను తీసుకున్నా
నూటికి తొంభైశాతం సినిమా బేస్డ్ ప్రోగ్రాములే. ప్రాయోజిత కార్యక్రమాలు (sponsored programs)తీసుకోండి. నూటికి నూరుశాతం సినిమాలపై ఆధారపడినవే. రియాలిటీ షోలు అనబడే emotional humbug కార్యక్రమాల్లో కూడా తొంభైశాతం సినిమా బేస్డ్. వ్యక్తిగతమైన ప్రతిభ యొక్క వికాసానికి ఇవి ఏమాత్రం దోహదం చేస్తాయన్నది ఓ పెద్ద అనుమానమే!


ఇవి కాక సినీ అవార్డుల ఫంక్షన్ల లైవ్ ప్రసారాలు వస్తున్నాయి. ఆపైన రిటైర్మెంట్ దగ్గర పడ్తోన్న హీరోలు తమ కుమారుల్ని తారాపధంలోకి ప్రవేశపెట్టేందుకు నిర్వహించే "లాంచింగ్ ప్రోగ్రాములు" అడపదడపా వస్తూనే ఉంటాయి. ఇంటర్వ్యూలు, స్పెషల్ కవరేజులు, ప్రమోషనల్ యాడ్స్ వగైరా వగైరాలు కూడా వస్తుంటాయి. వెరసి "సర్వం శివమయం" అన్నట్టుగా వినోదమంటే సినిమాయే అన్నట్టు ప్రచారం జరిగిపోతోంది.

ఈ సినిమా మాయ పండుగల్ని కూడా వదలదు. భక్తితో ఆచరించుకోవాల్సిన పండుగపూట ఇంటిల్లిపాదీ హింసానందంలో మునిగిపోవాల్సిందే. "ఒక్కడు" లేక "ఆ నలుగురు"తో సర్దుకుపోవాల్సిందే.

ఇంతకీ ఈ సినిమా మానియా మనకు ఇస్తున్నటువంటి అదనపు మౌల్యాధారిత ప్రయోజనం (value-added usage) ఏమైనా ఉందా అని చూస్తే నా వరకూ సున్నా అనే అనిపిస్తుంది. 

సినిమా అంటే కొన్ని వందలమంది కష్టఫలితమే. ఇందులో అనుమానం లేదు. కానీ అంత డబ్బు ఖర్చుపెట్టి, అంతమంది శ్రమదానంతో సాధిస్తున్నదేమిటి? నా పరిధిలో చూస్తే చిల్లర వినోదం, జుగుప్సాకరమైన బూతు విన్యాసాలు, మితిమీరిన హింస, నిరుపయోగమైన సెంటిమెంట్ల జోరు తప్ప వ్యక్తిగత వికాసానికి తోడుపడే ఒక్క అంశం కూడా ఇప్పటి సినిమాల్లో కనబడడంలేదు.
**********
Slumdog Millionaire సినిమా చర్చల దుమారాన్ని రేపింది. ఈమధ్య కాలంలో ఏ తెలుగు సినిమా కూడా ఇలాంటి చర్చలను లేవదీయలేదు. అద్భుతమైన గ్రాస్ కలెక్షన్స్ తో ఆడుతున్నట్టుగానో, మంచి ఓపెనింగ్ టాక్ వచ్చినట్టుగానో పత్రికల్లో రాసుకోవడమే తప్ప తెలుగు సినిమాలు మెదడుకు మేత వేసిన సందర్భాలు చాలా తక్కువ. 

నా వరకూ, గూడవల్లి రామబ్రహ్మం గారి "మాలపిల్ల", అక్కినేని నాగేశ్వర రావు నిర్మాతగా వచ్చిన "సుడిగుండాలు", సి.హెచ్.ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన "అంకురం" మెయిన్ స్ట్రీమ్ లో వచ్చిన మంచి చిత్రాలు. ఇవి నిజంగా మన మెదడుకు పని కల్పించే చిత్రాలే. ఈమధ్యలో సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించే సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ అవేవీ కమర్షియల్ చట్రంనుంచి బైటపడలేదు.

రౌడీయిజం గురించి చూపించే సినిమాలు కూడ సమకాలీన సమస్యల్నే ప్రతిబింబిస్తాయి. కానీ రౌడీయిజంను గ్లోరిఫై చేయడం ద్వారా సమస్యల్ని పెంచుతున్నాయి. అలాగే టీనేజ్ ప్రేమచిత్రాలు కూడా. విజయవాడలో ఓ అమ్మాయిని కిరాతకంగా హత్య చేసిన యువకుడు ఆ అమ్మాయి దేహం పై "చిరుత" అని రాయడం ఒక ఉదాహరణ. నిత్యకృత్యమైపోయిన యాసిడ్ దాడుల్లో ముప్పాతిక భాగం సినిమా ప్రేరితాలే కదా!

ఐతే సినిమాల వల్ల (ముఖ్యంగా గేయ సాహిత్యం వల్ల) సమాజంలో కొన్ని మంచి మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఓ ఇంటర్నెట్ డిస్కషన్ ఫోరమ్ లో చదివాను ఘంటసాల పాడిన "కల కానిది విలువైనది" అలాగే కిషోర్ కుమార్ పాడిన "సంఝౌతా గమోంసే కర్ లో" పాటలు అప్పటి యువతరంలో ఆత్మహత్యా ధోరణిని తగ్గించగలిగాయట. అలానే 1970ల్లో వచ్చిన "కోరికలే గుర్రాలైతే", "మరో చరిత్రలు" కూడా కొద్దిపాటి మంచి ప్రభావాన్ని చూపగలిగాయి. విశ్వనాథ్ తీసిన "శంకరాభరణం", "సాగరసంగమం" సంగీత, నృత్యాల పట్ల ప్రజల్లో అభిరుచిని పెంచగలిగాయి. కానీ ఈ ప్రభావాల పరిధి చాలా తక్కువ.
**********
సమాజంపై నిజమైన ప్రభావం చూపగలిగిన సినిమాలు తెలుగులో చాలా తక్కువ. ప్రేక్షకులు కోరినదని, ట్రెండ్ సెట్టింగ్ , కీర్తి కండూతి , డబ్బులు సంపాదన వంటి విషవలయాలలోనే మన సినిమాలు తిరుగుతున్నాయి.

బాపు, విశ్వనాథ్, బాలచందర్ వంటి సీరియస్ దర్శకుల ఒరవడిని కొనసాగించేవాళ్ళు కనుచూపు మేరలో ఎవరూ కనబడడంలేదనేది నావంటి వారి ఆవేదన.

నాయక, నాయికల భాష మారిపోయింది. వేషభూషలూ మారిపోయాయి. ఎంత రోతగా ఉంటే అంత అప్ టు డేట్ అన్న ఫీలింగ్ పెరిగిపోయింది. మర్యాదలు మాయమైపోయాయి. ఒరే, ఒసే అని పిలుచుకునే విధానం అమలులోకి వచ్చేసింది. ప్రేమ కోసమై తల్లిదండ్రుల్ని మోసం చేయడమన్నది, అబద్ధాలు ఆడడమన్నది హీరోయిజమైపోయింది. ఆ అబద్ధాల్ని నిలుపుకోవడానికి ఎంతటి అఘాయిత్యానికైనా తెగబడడమన్నది రొటీన్ ఐపోయింది.


ఇప్పటి వెకిలి పాటలకు (మరీ ముఖ్యంగా డ్యూయెట్లకు)అనుగుణంగా టీవీల్లో వచ్చే పిల్లల డాన్స్ ప్రోగ్రాముల్లో చిన్న చిన్న పిల్లలు ఆ కవాతులు చేస్తుంటే చప్పట్లు కొట్టే వాళ్ళని, ముఖ్యంగా పిల్లల్ని అక్కడిదాకా లాక్కువచ్చిన తల్లిదండ్రుల్నీ ఛీకొట్టాలనిపిస్తుంది.

ఇదేనా మనం మన భావితరాలకు చేస్తున్న వాల్యూ అడిషన్? ఈరోజు టీవీలో గెంతులేసిన పిల్లలే యాసిడ్ పోయరని, ప్రేమ పేరుతో జీవితాల్నే అంతం చేసుకోరని గ్యారంటీ ఆ తల్లిదండ్రుల్లో ఉందనే అనుకోవాలా? సినిమాల్లోని హీరో హీరోయిన్లకు మల్లేనే వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసగించడమే మన ఆశయమా?

స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి సినిమాలు భారతీయుల్ని వెకిలిగా చూపించాయి అన్నది వ్యర్ధమైన వాదన అనే అనిపిస్తోంది. మన హీరో హీరోయిన్లు చేస్తున్న వెకిలి చేష్టలే "కళ"గా ప్రచారం పొంది డబ్బులు రాలుస్తున్నపుడు మన దేశంలోని దరిద్ర్యం కూడా కళనే. కళాకారులకు ఎల్లల్లేవు కదా! అందువల్ల హాలీవుడ్ వాళ్ళు కూడ మన దారిద్ర్యాన్ని "కళ"గా చూపించి సొమ్ము చేసుకోవచ్చు. వాటికి అవార్డులు రావడమన్నది ఒక అదనపు మెరుపు మాత్రమే.

వాదాల్ని లేవదీసే ఉద్దేశ్యంతో కాక ఒక నా అభిప్రాయాల్ని వినిపించేందుకే ఈ ఆర్టికల్ ను రాసాను.

28, జూన్ 2011, మంగళవారం

సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా బలమైన జాతిని నిర్మించిన స్టాలిన్

రష్యాలో సోషలిస్ట్ విప్లవం వచ్చినప్పుడు  తొలినాళ్లలో విప్లవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ చక్రవర్తుల అనుకూల వర్గంవాళ్లు తిరిగుబాటు చేశారు. ఆ సమయంలో ప్రతిరోధక శక్తులకి సామ్రాజ్యవాద దేశాలు మద్దతు ఇచ్చాయి.  బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రతిరోధక శక్తులకి మద్దతుగా తమ సైన్యాలని పంపాయి. అది వరకు మొదటి ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా బాగా నష్టపోయిన సామ్రాజ్యవాదులకి కొత్తగా రష్యాపై దాడి చెయ్యడం  పెద్ద ఖర్చు వ్యవహారమనిపించింది. దాంతో సామ్రాజ్యవాదులు రష్యా నుంచి తమ సైన్యాలని ఉపసంహరించుకున్నారు. సామ్రాజ్యవాదులు రష్యాపై ఎప్పటికైనా తిరిగి దాడి చేస్తారని స్టాలిన్ ముందే ఊహించాడు. సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా దేశాన్ని సంసిద్ధం చెయ్యాలంటే దేశాన్ని ఆర్థికంగా బలపరచాలి. దేశాన్ని ఆర్థికంగా బలపరచాలంటే దేశాన్ని పారిశ్రామీకరించాలి, వ్యవసాయాన్ని కూడా సమిష్టీకరించాలి. వ్యవసాయాన్ని సమిష్టీకరించడానికి అక్కడి మధ్య తరగతి రైతులు ఒప్పుకోలేదు. ప్రభుత్వం ఆ రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కుని వాటిని సమిష్టీకరించాల్సి వచ్చింది. తిరుగుబాటు చేసిన రైతుల్ని అరెస్ట్ చేయ్యడం లేదా పార్టీ కార్యకర్తల సహాయంతో బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. 1927 తరువాత రష్యాలో వేగంగా పారిశ్రామీకరణ, వ్యవసాయ సమిష్టీకరణ జరిగాయి. 1933లో రష్యాలోని పారిశ్రామీకరణ చూసి సామ్రాజ్యవాద దేశాలన్నీ భయపడ్డాయి. అదే సమయంలో జెర్మనీలో తీవ్రమైన anti-communist inclinations కలిగిన నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. రష్యాపై దాడి చేసే పని నాజీ సామ్రాజ్యవాదులు చూసుకుంటారని ఇతర సామ్రాజ్యవాద దేశాలు అనుకున్నాయి. నిజానికి నాజీ నియంత హిట్లర్ కంటే తీవ్రమైన anti-communist inclinations ఉన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాద నాయకుడు విన్స్టన్ చర్చిల్. అతను విప్లవ ప్రభుత్వాలని పురిట్లోనే చంపెయ్యాలని వాదించేవాడు. హిట్లర్ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రభావంతో సామ్రాజ్యవాదిగా ఎదిగాడు కానీ తన ఎదుగుదలని ప్రభావితం చేసిన బ్రిటిష్ సామ్రాజ్యం పైనే దాడి చెయ్యాలనుకున్నాడు. చివరికి హిట్లర్‌ని ఓడించడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు స్టాలిన్‌తో చేతులు కలపాసి వచ్చింది. 1940 నాటికి రష్యాలో విప్లవ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించింది. నిరుద్యోగాన్ని పూర్తిగా మాయం చేసింది. 1933 సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 20 నుంచి 30 శాతం నిరుద్యోగం ఉండేది. తమ దేశంలో విప్లవం రాకుండా ఉండేందుకు USA పాలక వర్గం కూడా నిరుద్యోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. నాజీ సైన్యాలు USAపై కూడా దాడి చెయ్యడంతో USA కూడా రెండవ ప్రపంచ యుద్ధంలోకి దిగి నాజీ కూటమిలో భాగమైన జపాన్‌పై దాడి చేశాయి. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. రష్యా గెలిచింది కానీ నాజీ బాంబు దాడులకి రష్యా కూడా ఆర్థికంగా నష్టపోయింది. నాజీలు ఫాక్టరీలతో పాటు వ్యవసాయ క్షేత్రాలపై కూడా బాంబులు వేశారు. 1940లో ప్రపంచంలోని 40% వ్యవసాయ ఎగుమతులు రష్యా నుంచే జరిగేవి. వ్యవసాయ క్షేత్రాలు బాంబు దాడుదలలో ద్వంసం కావడంతో వ్యవసాయ ఎగుమతులు భారీగా క్షీణించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత టైమ్‌లో సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లలో 80% మంది ప్రజలు పట్టణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు. అప్పటికీ USAలో పట్టణీకరణ 64% దాటలేదు.  సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లు USA కంటే వేగంగా పట్టణీకరణ చెందాయి కానీ దక్షిణ రిపబ్లిక్‌లు వ్యవసాయంపై భారీగా ఆధారపడ్డాయి. తజికిస్తాన్ రిపబ్లిక్‌లో పట్టణీకరణ కేవలం 33% ఉండేది. తుర్క్‌మెనిస్తాన్ రిపబ్లిక్‌లో ఎడారి భూములు ఎక్కువగా ఉండడంతో అక్కడ భారీ పరిశ్రమలు పెట్టలేకపోయారు. స్టాలిన్ రష్యాని పారిశ్రామీకరించినప్పటికీ ప్రాంతీయ అసమానతలని నిర్మూలించలేకపోయాడు. ఒకప్పుడు కజక్‌స్తాన్ ప్రాంతంలో పశువులని పోషించుకుంటూ, జంతువులని వేటాడుకుంటూ తిరిగిన సంచార జాతుల వారికి  స్థిర నివాసాలు కల్పించడం జరిగింది కానీ వారు ఇప్పటికీ తమ సంప్రదాయమైన వేట మానలేదు. సాంస్కృతికంగా కూడా దక్షిణ రిపబ్లిక్‌లు వెనుకబడి ఉండేవి. దక్షిణ రిపబ్లిక్‌లు ఆర్థికంగా & సాంస్కృతికంగా వెనుకబడి ఉండడంతో 1990లో సోవియట్ సమాఖ్యని విచ్ఛితి చెయ్యడం సాధ్యమయ్యింది. సోవియట్ సమాఖ్య విచ్ఛిన్నమైనా ఆ సమాఖ్య సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహంలా గర్జించింది అనే విషయాన్ని మర్చిపోలేము.

26, జూన్ 2011, ఆదివారం

అన్నమో


లేక..,, ఏసూ, అల్లా, యాహ్వే,గాడ్...ఎవరైనా...

ప్రపంచవ్యాప్తంగా ఆకలి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. 2015 నాటికి ఆకలిబారిన పడుతున్న వారి సంఖ్యని సగానికి తగ్గించాలని 1996 ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫూడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ - ఎఫ్.ఎ.ఒ) ప్రపంచంలో ఆకలి బారిన పడుతున్న వారి సంఖ్య 2007లో 92.3 కోట్లు నుండి 2008లో 96.30 కోట్లకి పెరిగిందనీ, 2009 ఆర్ధిక సంక్షోభం దీనిని మరో 4 కోట్లు పెంచొచ్చని అంచనా వేసింది.అంటే ప్రపంచమంతటా ఆకలిబారిన పడేవారి సంఖ్య 100 కోట్ల వరకు చేరిందని అర్ధం (ప్రపంచ జనాభా సుమారు 600కోట్లు!).

ఇంకా ఉండొచ్చు!

ఆహార ధాన్యాల ధరలు పెరిగితే పేదలకు ఆహార లభ్యత తగ్గుతుందన్న సూత్రీకరణ ఆధారంగా ఈగణాంకాలు రూపొందుతాయి.ధరల ప్రాతిపధికగాగణించే ఈ లెక్కలు పరిస్థితి తీవ్రతను తక్కువగా చేసి చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్టులో గత మూడేళ్ళుగా మూడు రెట్లు పెరిగిన గోధుమ, బియ్యం ధరలు ఈ సంవత్సరం (2009) కొద్దిగా తగ్గాయి. అయితే ఆసియా దేశాలలో వీటి ధరలు పెరిగాయి. అందువల్ల దారిద్ర్యంలోకి నెట్టబడిన లక్షలాది మంది పై నివేదికల గణాంకాల్లో చేరరు.
2007గాను రికార్డు స్థాయిలో 230 కోట్ల టన్నుల ఆహర ధాన్యాలు పండాయి. అంతకు ముందు ఏడాది కంటే ఇది 4 శాతం అధికం. 2008లో ఇది మరో 2 శాతం పెరిగింది. ఈ ఏడాది ఆహారధ్యాన్యాల దిగుబడి కనీసం గత ఏడాది స్థాయిలో ఉండగలదని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా, 1961 నుంచి నేటి వరకు ఆహారధాన్యాల దిగుబడి మూడు రెట్లు పెరగ్గా, జనాభా మాత్రం రెట్టింపు మాత్రమే పెరిగింది. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే ప్రపంచ ప్రజలందరి కడుపు నింపగల ఆహార ధాన్యాలున్నాయి. అయితే ఇవి అందాల్సిన వారికిఅందకపోవడం వల్లే సమస్యంతా.

కారణాలు - కథలు, కాకరకాయలు

ప్రపంచంలో ఆకలి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంపై కల్లబొల్లి కారణాలు చెబుతున్నారు - కరువు, వరదలు వంటి సమస్యలతో పంటలు దెబ్బతినటం, భారత్, చైనాలలోని ప్రజలు ఇదివరకటి కంటే ఎక్కువ తినటం వగైరా; సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఫలితంగా వెనుకబడిన దేశాల ప్రజల ఆధాయాలు పెరిగినందున, వారెక్కువ ఆహారధన్యాలు వినియోగించుకుంటున్నారన్నదివాదన (2008 చివర్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసినమోసపూరిత వాదన ఇది. దీనికి విరుద్ధంగా ఊబకాయ పీడితులవుతున్న అమెరికన్లు తిండిపోతులన్న అసలు కారణాన్ని విస్మరించారు.) ఈ గణాంకాలునిజమే అయినా ఆకలి, ఆహార ధరలనువివరించే కారణాలు కావని గ్రహించాలి.ధనిక వర్గాల ఆహార వినియోగం పెరిగిందన్నది వాస్తవమే. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న ధరల కారణంగా పేదలు తగినంత ఆహారం పొందలేక పోతున్నారన్నది కూడా యధార్థమే. ప్రపంచంలోనే సంపన్న దేశంగా అలరారుతున్న అమెరికాలో సయితం 10శాతం జనాభా అర్ధాకలితో అలమటిస్తున్నారన్నది కూడా వాస్తవమే.

అసలు విషయాలు

ఆహార ధాన్యాల ధరలను, ఆహారభద్రతను ప్రభావితం చేస్తున్న ఒక అంశం జీవ ఇంధన ఉత్పత్తి కొరకు సారవంతమైన భూములను వినియోగించడం. మొక్కజొన్న నుండి తయారు చేసేబయో డీజిల్ వాడకం ద్వారా బొగ్గు, పెట్రోలు వంటి భూగర్భ వనరుల వినియోగాన్ని తగ్గించాలనిఅమెరికా, మరియు ముఖ్యంగా యురోపియన్ యూనియన్ దేశాలు తీసుకున్న నిర్ణయంతో సారవంతమైన భూములు ప్రజల ఆహార అవసరాలకు కాక కార్లు నడపడానికి డీజిల్ పండించే భూములుగా మారిపోయాయి. దీనితో ఆహార ధాన్యాల దిగుమతి తగ్గి, ధరలు పెరుగుతున్నాయి.
డెబ్బయవ దశకంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి రుద్దిన వాణిజ్య సరళీకరణ, వ్యవస్థాగత సర్దుబాట్ల కార్యక్రమాలు పెరిగి పెద్దవయ్యాయి. 90వ దశకంలో వాణిజ్య సంస్థల విధానాలతో, జన్యుమార్పిడి పంటలతో ప్రపంచమంతా ఆకలి సంక్షోభం తీవ్రమయింది.
ఒకమారు హైతీ ఉదంతాన్ని పరిశీలిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. దశాబ్దాల క్రిందట వరి పంట సమృద్ధిగా ఉన్న దేశం హైతీ. దిగుమతులపై ఆంక్షలను 1994లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయం అందించి తొలగింప చేసింది. అమెరికా ప్రభుత్వం విపరీతంగా సబ్సిడీ ఇచ్చి చౌక ధరల వరి ఎగుమతులతో హైతీని నింపేసింది. దాంతో లాటిన్ అమెరికాలో అతి చిన్న దేశమైన హైతీలో వరిపంట అదృశ్యమైపోయింది. ఆ తరువాత అక్కడ వరి ధరలు పెరిగిపోయాయి. ప్రజలు కొనలేక విధుల్లోకొచ్చి పోరాటాలకు దిగారు.
ఇదే విధంగా పశ్చిమాఫ్రికాలోని మారిటానియా నుండి బుర్కినాఫాసో వరకు ఉన్న దేశాలలో వరిపంట నాశానమైపోయి ప్రజలు వీధుల్లోకొచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
అన్నమో రామచంద్రా! అన్నది ప్రపంచంలో వందకోట్ల మంది ఆకలి కేకలు! ఆహారం - ఆకలి అనే ఈ సంక్షోభ స్వభావాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది

సావిత్రి జీవితం


సినీ సామ్రాజ్ఞి....సావిత్రి

savitri in a movie stillతెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్నిఅలరించారు మహానటి సావిత్రి. తెలుగు వారు మరచిపోలేని పాత్ర "దేవదాసు"లోని పారు. ఇఫ్పటికీ వన్నె తరగని చిత్రమది. అలాగే "మాయాబజార్"లోని శశిరేఖ పాత్ర. ఇప్పటికీ "అహనా పెళ్ళంట...." పాటని ఆ సన్నివేశాన్ని ఎవరూ మరువలేరు . చూపులతో, పెదవి కదలికలతో, తన నటనతో ఎందరినో మంత్రముగ్ధులను చేశారు ఆమె. "నర్తనశాల", "శ్రీకృష్ణపాండవీయం", "సుమంగళి", "నాదీ ఆడజన్మే", "నవరాత్రి" ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఆమె నటనాకౌశలానికి దీపికలు. "దొంగరాముడు", "తోడికోడళ్ళు", "అభిమానం", "మురిపించేమువ్వలు(1960)", "మంచిమనసులు(1961)", "డా. చక్రవర్తి (1964)", "దేవత(1965)", "మనసే మందిరం (1971)"... వంటి చిత్రాలు ఆమె నటనకి మైలు రాళ్ళు. తెలుగు తమిళ, హిందీ చిత్రాలన్నిటిలో కలిపి 318 సినిమాలలో నటించారు. హిందీలో "బహుత్ దిన్ హుమై", "ఘర్ బసాకే దేఖో", "బలరామ్ శ్రీకృష్ణ", "గంగాకి లహరే" మొదలైన చిత్రాలు చేశారు. సావిత్రిని దక్షిణాది మీనాకుమారిగా అభివర్ణించేవారు.

తెరవెనుక పాత్రల్లో

దర్శకురాలిగా : మాతృదేవత, వింత సంసారం, చిన్నారి పాపలు, చిరంజీవి మొదలైన చిత్రాలు.

నిర్మాతగా: చిన్నారి పాపలు, ఏక్ చిట్టీ ప్యార్ భరీ చిత్రం బాగుందన్నా... ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది.

గాయనిగా: నవరాత్రి సినిమాలో ఒక పాట పాడారు.

బిరుదులు, అవార్డులు

తమిళ్ రాష్ర్ర ప్రభుత్వంచే కలైమామణి...

నడిగర్ తిలగమ్...

నటశిరోమణి...

మహానటి....

ఉత్తమ నటీమణి...

ఇంకా ఎన్నో అవార్డులు అందుకున్నారు....
ఎవ్వరూ ఇవ్వలేని, స్వయంగా సంపాదించుకున్న అవార్డు/రివార్డు "ప్రజల హృదయాలలో చిరంజీవి"గా నిలిచిపోవడమే ఆమెకు అసలైన అవార్డు.

జగతి మరువలేని నటి సావిత్రి . ఆమే నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె "జీవించిన" చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. అమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి.
సావిత్రి పుట్టిననెల గిట్టిన నెల డిసెంబరు మాసం కావటం కాకతాళీయం. జననం డిసెంబరు 6,1937 - మరణం డిసెంబరు 26, 1981 (శనివారం). ఆమె జీవిత కాలం కేవలం 44సంవత్సరాలు మాత్రమే.

బాల్యం

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న నిస్సాంకురమ్ గురవయ్య, సుభద్రమ్మలకు జన్నించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చారు. నందమూరి తారకరామారావు, జగ్గయ్య వంటి మహా నటులు ఆరోజుల్లో నడిపిన నాటక ప్రదర్శనలలోనూ స్టేజీమీద ప్రదర్శనలిచ్చారు. తరువాత కాలంలో "నవభారత నాట్యమండలి" అనే నాటక కంపెనీ స్ధాపించారు. బుజ్జిబాబు రచించిన "ఆత్మ వంచన" నాటకం ప్రదర్శన ప్రసిద్ధి చెందింది.
12 సంవత్సరాల వయస్సులో మద్రాసు చేరిన ఆమె సినిమాలలో ప్రయత్నం చేశారు. తెలుగులో తొలి అవకాశం యల్.వి.ప్రసాద్ గారి "సంసారం" సినిమాలో లభించింది. 1949లో "అగ్ని పరీక్ష"లో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేక ఆపాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయలేదు. అనంతరం "పాతాళభైరవి" చిత్రంలో నృత్యపాత్రలో కనిపించారు. అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె నట జీవితం "పెళ్ళిచేసి చూడు", "అర్ధాంగి", "మిస్సమ్మ" ఇలా ఎన్నో సినిమాలతో ఎదిగి, మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మహానటిగా నిలబెట్టింది. ఆమె తెలుగుతో పాటు తమిళ సినిమాలలోనూ తిరుగులేని నటీమణి. ఆమె తొలుత ప్రముఖ తమిళ హీరో జెమినీగణేష్ తోనూ, శివాజీ గణేశన్ తోనూ అనేక చిత్రాలలో నటించారు.

వివాహ జీవితం

"మనంపోల మాంగల్యమ్(1953)" తమిళ సినిమాలో ఆమె నటించారు. హీరో జెమినీ గణేష్. ఆ సమయంలోనే ప్రేమ మత్తులో పడి 1953లోనే ఆమె జెమినీ గణేష్ ని వివాహం చేసుకున్నారు. కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ లను చాలా స్ట్రిక్ట్‌గా డిసిప్లిన్‌తో పెంచారు. టి.వి.లు లేని ఆరోజుల్లో 16ఎం.ఎం. ప్రొజెక్టర్ పెట్టి ఇంట్లోనే సినిమాలు చూసేవారు.savithri giving her gold arnaments to Prime Ministers Relief Fund in the presence of PM Lal Bahadur Sastri
అడిగినవారికి లేదనకుండా దానమిచ్చే దానశీలి సావిత్రి. లాల్ బహుదూర్ శాస్తిగారి సమక్షంలో తన వంటిమీదున్న నగలని ప్రధాన మంత్రి సహాయ నిధికి దానమిచ్చారు. ఆమె సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చయ్యేది. అందరినీ నమ్మేవారు.

అభిరుచులు....

ఆమెకి క్రికెట్ అన్నా, ఛెస్ అటలంటే ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ. పిల్లలని ప్రేమతో చూసుకునేవారు.
తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి తెలుగు సినీ సామ్రాజ్ఞి. సినీ జీవితంలో అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినా,నిజ జీవితంలో అతిఘోరంగా విఫలమైయ్యరు. చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె జీవిత చరమాంకం అందరికీ ఒక పాఠం. ఆమె నటజీవితం ఎందరో నటీమణులకి మార్గదర్శకం.

సావిత్రి జీవితం - చరమాంకం

"మనంపోల మాంగల్యమ్(1953)" తమిళ సినిమాలో ఆమె నటించే సమయంలోనే.హీరో జెమినీ గణేష్ ప్రేమ మత్తులో పడి ఆమె ఆయనను వివాహం చేసుకున్నారు. ఎంతో ఇష్టపడి, ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె వైవాహిక జీవితం మాత్రం ముళ్ళబాటలోనే నడిచింది. వివాహ సంబంధాలు ఇరువురి మధ్య తెగిపోయాయి. నమ్మిన వ్యక్తులే మోసపుచ్చి ఆమెను నట్టేట ముంచారు . ఎంతో సంపన్నురాలైన ఆమె వ్యాపారాలపేరిట, దానాలపేరిట, మోసాలపాలై, ఇలా సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. జీవితంలో తట్టుకోలేని సమస్యలు, మెంటల్ టెన్షన్ లు ఎక్కువయ్యాయి. చివరికి వ్యసనాలకు బానిస అయ్యారు. తాగుడు, నిద్రమాత్రలు, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడ్డారు. అనేక మార్లు ఆస్పత్రిలో చేరి చికిత్సనూ పొందారు. డాక్టర్లు మత్తు పదార్ధాలు వలదని వారించినా ఫలితం లేకపోయేది.
చివరిసారిగా ఆమె బెంగుళూరు సమీపంలో తెలుగు చిత్రానికి షూటింగ్‌లో పాల్గొనటానికి వెళ్లి (మత్తులో) పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్ధురాలు కూడా అయిన ఆమె అంతిమ దశలోకి (టర్మినల్ కోమా) చేరుకున్నారు. ఆమె మరణించడానికి ముందు సినీ పరిశ్రమ నుంచి (సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛేంబర్ గోల్డెన్ కమిటీ) ఆమెకి 10,000 రూపాయలు విరాళం అంధింది. అవి ఆమె వైద్యానికి ఎంత మాత్రం సహాయ పడ్డాయో తెలియదు. ఇద్దరు పిల్లలు, నర్సు సంరక్షణలో, అద్దె భవనంలో అతి భయంకరమైన పరిస్ధితిలో.... దాదాపు 18 నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం డిసెంబరు 26, 1981, శనివారు రాత్రి 11గం.లకు తుది శ్వాస విడిచారు

మహానటి సావిత్రి


మహానటి సావిత్రి ఒక నిజమైన లెజండ్

By కె, మణినాథ్

జగతి మరువలేని నటి సావిత్రి . ఆమే నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె "జీవించిన" చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. అమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి.
సావిత్రి పుట్టిననెల గిట్టిన నెల డిసెంబరు మాసం కావటం కాకతాళీయం. జననం డిసెంబరు 6,1937 - మరణం డిసెంబరు 26, 1981 (శనివారం). ఆమె జీవిత కాలం కేవలం 44సంవత్సరాలు మాత్రమే.

బాల్యం

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న నిస్సాంకురమ్ గురవయ్య, సుభద్రమ్మలకు జన్నించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చారు. నందమూరి తారకరామారావు, జగ్గయ్య వంటి మహా నటులు ఆరోజుల్లో నడిపిన నాటక ప్రదర్శనలలోనూ స్టేజీమీద ప్రదర్శనలిచ్చారు. తరువాత కాలంలో "నవభారత నాట్యమండలి" అనే నాటక కంపెనీ స్ధాపించారు. బుజ్జిబాబు రచించిన "ఆత్మ వంచన" నాటకం ప్రదర్శన ప్రసిద్ధి చెందింది.
12 సంవత్సరాల వయస్సులో మద్రాసు చేరిన ఆమె సినిమాలలో ప్రయత్నం చేశారు. తెలుగులో తొలి అవకాశం యల్.వి.ప్రసాద్ గారి "సంసారం" సినిమాలో లభించింది. 1949లో "అగ్ని పరీక్ష"లో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేక ఆపాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయలేదు. అనంతరం "పాతాళభైరవి" చిత్రంలో నృత్యపాత్రలో కనిపించారు. అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె నట జీవితం "పెళ్ళిచేసి చూడు", "అర్ధాంగి", "మిస్సమ్మ" ఇలా ఎన్నో సినిమాలతో ఎదిగి, మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మహానటిగా నిలబెట్టింది. ఆమె తెలుగుతో పాటు తమిళ సినిమాలలోనూ తిరుగులేని నటీమణి. ఆమె తొలుత ప్రముఖ తమిళ హీరో జెమినీగణేష్ తోనూ, శివాజీ గణేశన్ తోనూ అనేక చిత్రాలలో నటించారు.

వివాహ జీవితం

"మనంపోల మాంగల్యమ్(1953)" తమిళ సినిమాలో ఆమె నటించారు. హీరో జెమినీ గణేష్. ఆ సమయంలోనే ప్రేమ మత్తులో పడి 1953లోనే ఆమె జెమినీ గణేష్ ని వివాహం చేసుకున్నారు. కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ లను చాలా స్ట్రిక్ట్‌గా డిసిప్లిన్‌తో పెంచారు. టి.వి.లు లేని ఆరోజుల్లో 16ఎం.ఎం. ప్రొజెక్టర్ పెట్టి ఇంట్లోనే సినిమాలు చూసేవారు.savithri giving her gold arnaments to Prime Ministers Relief Fund in the presence of PM Lal Bahadur Sastri
అడిగినవారికి లేదనకుండా దానమిచ్చే దానశీలి సావిత్రి. లాల్ బహుదూర్ శాస్తిగారి సమక్షంలో తన వంటిమీదున్న నగలని ప్రధాన మంత్రి సహాయ నిధికి దానమిచ్చారు. ఆమె సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చయ్యేది. అందరినీ నమ్మేవారు.

అభిరుచులు....

ఆమెకి క్రికెట్ అన్నా, ఛెస్ అటలంటే ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ. పిల్లలని ప్రేమతో చూసుకునేవారు.
తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి తెలుగు సినీ సామ్రాజ్ఞి. సినీ జీవితంలో అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినా,నిజ జీవితంలో అతిఘోరంగా విఫలమైయ్యరు. చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె జీవిత చరమాంకం అందరికీ ఒక పాఠం. ఆమె నటజీవితం ఎందరో నటీమణులకి మార్గదర్శకం

25, జూన్ 2011, శనివారం

Srikrishna Rayabaram once again

Sri Krishna Rayabaram - Part1 

Sri Krishna Rayabaram - Part2 

Sri Krishna Rayabaram - Part3 
 

ప్రేమికులకి మిగిలేవి!!!



ప్రేమికులకి మిగిలేవి చివరికి అ, ఆ, ఇ, ఈ లే

"అ" - అరగించుకోలేని అశాంతి

"ఆ" - ఆరని చిచ్చు

"ఇ" - ఇంగితం లేని బ్రతుకు

"ఈ" - ఈసురోమనే జీవితం

1, మే 2011, ఆదివారం

కుక్కమూతి పిందెలు


  ఈ కాలమ్ కీ సత్యసాయిబాబా దేవుడా? అవతార పురుషుడా? అన్న ప్రశ్నలకీ ఎటువంటి సంబంధంలేదు.
1964 మే 27 సాయంకాలం ఢిల్లీ నుంచి తెలుగువార్తల ప్రసారం ప్రారంభమయింది. "మన ప్రియతమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇకలేరు" అని న్యూస్ రీడర్ చదువుతూంటే అతని గొంతు వణికింది. దుఃఖంతో గొంతు బొంగురుపోయింది. ఆ రీడర్ పేరు రామచంద్రరావు. ఆ ఒక్క కారణానికే అతని ఉద్యోగం పోయింది.
'వార్త 'ని చెప్పేటప్పుడు వ్యక్తిగతమయిన - ఇంకాస్త ముందుకు వెళ్ళి - వ్యవస్థాగతమైన ఆవేశానికి స్థానం లేదు. ఇది అతి ముఖ్య సూత్రం.
మొన్న సత్యసాయిబాబా అస్తమించారు. ఒకానొక ఛానల్ ఆ విషయాన్ని ఇలా చెప్పింది. "సాయిబాబా మరణించారు. 96 సంవత్సరాలు బతుకుతానని చెప్పిన బాబా మాట తప్పారు" అని. ఆ ఛానల్ పేరు చెప్పి ఆ పాపం కట్టుకోను. ఇదే సమయంలో అతి బాధ్యతాయుతమైన మర్యాదతో, సంయమనంతో - ఇంకా భక్తితో ఈ టీవీ, హెచ్ ఎం టీవీ, రాజ్ టీవీ (నేను చూసిన ఛానళ్ళు) ఈ వార్తల్ని ప్రసారం చేశాయి. ఆ నాలుగు రోజులూ ప్రసారం చేస్తున్నాయి - అంతే ఉదాత్తంగా.
నేను తీవ్రవాదిని కాను. అతివాదిని కాను. ఛాందసుడిని కాను. ఈ దేశంలో కోట్లాదిమందిలో ఒకడిని. వార్తకీ, వ్యాఖ్యకీ బోలెడంత తేడా ఉంది. రాష్ర్టపతులూ, ప్రధాని, దేశ దేశాల ప్రతినిధులూ, గవర్నర్లు, ముఖ్యమంత్రులూ, ప్రతిపక్షనాయకులూ, ఇటలీ నాయకులూ, 160 దేశాల వారు శ్రద్ధాంజలి ఘటించిన ఒక 'భారతీయునికి' ఒక భారతీయ ఛానల్ ఈ దేశంలో చూపించిన మర్యాద ఇది. ఈ ఛానల్ ని మర్యాద చూపమని ఎవరూ దేబిరించలేదు. మీ అమ్మని విమర్శించే హక్కు మీకుంది. అది మీ సంస్కారం. కాని మా అమ్మని, మా దేవుడిని గౌరవించవలసిన బాధ్యత మీకుంది. అది మా హక్కు. ఇది బతిమాలి పుచ్చుకునేది కాదు. వార్తా ప్రసారంలో ప్రాధమిక సూత్రం. వేలాదిమంది సెన్సిటివిటీని గౌరవించవలసిన బాధ్యత అది. బహుశా ఈ ఛానల్స్ నడిపేవారి స్థాయి, సంస్కారం, అవగాహన - ఈ ప్రాధమిక సూత్రాల వరకూ వచ్చి ఉండదు.
You have a right too be wrong when it is a question of opinion. But you have no right to be wrong when it is a question of fact.
ఒక న్యూస్ రీడర్ వదరుబోతుతనం ఇది. గాజులు తొడుక్కున్న భారతదేశం కనుక చెల్లింది. ఎక్కడో డేనిష్ పత్రికలో అల్లా గురించి కార్టూను ప్రచురిస్తే - డెన్మార్క్ ఎక్కడుందో తెలియని వాళ్ళు, ఆ కార్టూన్లు ఏమిటో చూడని వాళ్ళు ప్రపంచంలో ఎన్నో చోట్ల కార్లు, బస్సులు తగలెట్టారు. నేనా కార్టూన్లు చూశాను. అలాంటి పని చెయ్యమని కోరడం లేదు.
ఆత్మవంచనని ఈ జాతి అర్హతగా మెడలో మూర్చ బిళ్ళలాగ కట్టుకుని ఊరేగడాన్ని నిరసిస్తున్నాను. ధర్మానికి ప్రతీకగా పురాణాలు అభివర్ణించిన యమధర్మరాజు చేత లిమ్కా తాగించే సరదా సినిమాని చూసి మనం చంకలు గుద్దుకుంటాం. ఎప్పుడయినా, ఎవరయినా క్రైస్తవ మతాన్ని అవలంభించే ఇన్ని ప్రపంచ దేశాలలో సెంట్ లూక్ గురించో, సెంట్ పీటర్ గురించో ఇలాంటి పారిహాసిక తీశారా? తీస్తే బతికి బట్టకట్ట గలుగుతారా?
మన సంస్కృతిని గురించి మనకి అభిమానం లేదు. ఛానళ్ళను కల్లు దుకాణాల్లాగ నడిపే వ్యాపారస్తుల వదరుబోతుదనాన్ని భరించే దుర్దశ మనకి పట్టింది. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది సెన్సిటివిటికి గౌరవం ఇవ్వాలన్న కనీసపు మర్యాద నియమాన్ని పాటించని ఈ ఛానల్స్ని ఈ ప్రభుత్వం ఎందుకు నిలదీయదు? ప్రభుత్వ లాంఛనాలతో గవర్నరు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకులు స్వయంగా నిలబడి ఈ గొప్ప లాంఛనాన్ని జరిపించిన పెద్దలు "సాయిబాబ మాట తప్పాడు" అని చంకలు గుద్దుకున్న ఛానల్ పరిహాసాన్ని మాధ్యమాల స్వేచ్చగా సరిపెట్టుకుంటారా? మైనారిటీలకు వీరిచ్చే గౌరవం వారే స్వయంగా పూనుకుని గౌరవించిన ఒక మహనీయుని పట్ల జరిగిన బాధ్యతారాహిత్యాన్ని ఎందుకు నిలదీయరు?
మరొక దరిద్రం. ఈ వార్తని రాసేవారికి బొత్తిగా అవగాహన లేమి. బాబాగారు విద్యారంగానికి సేవ చేశారు, అనంతపురానికి నీళ్ళు ఇచ్చారు, తమిళనాడుకి గొట్టాలు వేశారు - అని పదే పదే ఛానళ్ళు చెప్పాయి. ఈ కారణంగానే వారికి తామిచ్చే గౌరవం, ఈ కారణంగానే వారికి జాతి నివాళులర్పిస్తోందని వారి కితాబుల్లో అర్ధమయింది. అయ్యా, ఇవన్నీ అతి చిన్న విషయాలు. నేలబారు సంగతులు. ఒక బిర్లా గారు, ఒక టాటాగారు ఇంతకంటే బాగా, గొప్పగా చెయ్యగలరు. 160 దేశాలలో లక్షల మంది ఈ ప్రయోజనాన్ని పంచుకోలేదు, ఈ నీళ్ళు తాగలేదు, అయినా వారంతా స్పందించారు. ఎందుకని? ఈనాటి ఆధునిక యుగంలో అక్రమాలు, అవినీతి, ఆ వ్యవస్థ పెచ్చు రేగిపోతున్న నేపధ్యంలో సేవాభావం, ప్రేమ అనే రెండు గొప్పగుణాలను దేశాల ఎల్లలు చెరిపి స్వామి ప్రసారం చెయ్యగలిగారు.
నేను పుట్టపుర్తి ఆసుపత్రిలోకి వెళుతూ నా చెప్పుల్ని బయట వదిలేశాను. ఒక ముసలాయన ఆ చెప్పుల్ని భరతుడు పాదుకల్ని పట్టుకున్నట్టు అందుకుని పెట్టాల్సిన స్థలంలో ఉంచుతున్నాడు. ఆయన ఏదో రాష్ర్టంలో ప్రభుత్వంలో గెజిటెడ్ ఆఫీసరు.
స్వామి అద్భుతాలతో మనకి పనిలేదు. కాని 2011 లో ఏకీభావంతో, వినయంతో కుల, మత, ప్రాంత వివక్ష లేని సేవా సైన్యాన్ని తయారుచేశాడాయన. ఈ విజయం ముందు విద్య, నీళ్ళు తృణప్రాయం. విద్య ఇప్పుడు చదువుకునేవారికి. సమభావం, ప్రేమ వయస్సులో ఉన్న సర్వులకూ. ఈ సత్యం దాదాపు అన్ని ఛానల్స్ కీ అర్ధం కాలేదు. ఆశ్చర్యం లేదు.
165 సంవత్సరాల క్రితం ఒకాయన రాముడితో మొరపెట్టుకున్నాడు. "నాదుపై పలికారు నరులు, వేద సన్నుత భవము వేరుచేసి తిననుచు.." అని. ఆధ్యాత్మిక చింతనని పెంచి ఈ లోకపు రీతిని విస్మరించానని నన్నంతా విమర్శిస్తున్నారయ్యా - అని వాపోయాడు. ఆయన పేరు త్యాగరాజస్వామి. ఆధ్యాత్మికానికి విడాకులిచ్చి, నీళ్ళు, గొట్టాలు అని మనకర్ధమయే విలువలకి మాత్రమే పరిమితమైయిపోయే 'కురచ' దృక్పధాన్ని పెంచుకోడానికి కేవలం 165 సంవత్సరాలు సరిపోయింది! సత్యసాయిబాబా మరణించాడు, మాట తప్పాడు అని ఈ ఛానల్ ఉవాచ. నిర్యాణం, అస్తమయంలాంటి మాటలు ఈ ఉద్యోగులకు చేతకావు. భేష్.
పోనీ, "స్టాలిన్ చచ్చాడు. లెనిన్ చచ్చాడు" అని చెపుతారా వీరు?
మనకి తెలియని విషయం తెలియదని తెలుసుకోవడం విజ్నానం. మనకి తెలిసిన విషయమే దేశానికంతటికీ తెలిసిన, తెలియాల్సిన విషయం అనుకోవడం మూర్తీభవించిన అజ్ఞానం, వార్తా ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చోటులేని అహంకారం. జులుం.
కోటంరాజు రామారావు, ఎస్.వై. చింతామణి, కుందుర్తి ఈశ్వరదత్తు, ఖాసా సుబ్బారావు, నార్లవంటి మహనీయులు జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఈ గొప్ప మాధ్యమం ఈనాటికి ఇలాంటి కుక్క మూతి పిందెల పాలున పడిపోయింది. అది మన దౌర్భాగ్యం.
రేపు తాజ్ మహల్ కూలిపోయిందని ఎవరయినా చెపితే నిజమా కాదా అని పరీక్షించుకునేందుకు పారదర్శకమైన ఛానళ్ళు లేవు. తమ నమ్మకాల్ని అమ్మకాలు చేసుకునే వ్యాపారస్తులకు వృత్తిలో నిజాయితీని నేర్పడం, హంతకుడికి మంగళహారతి పట్టడం లాంటిది.
నేనిదివరకు బాబా గారి గురించి చాలా కాలంస్ రాశాను. చివర ఒక వాక్యం రాయడం రివాజు - "నేను బాబా భక్తుడిని కాను" అని.
ఇప్పుడు బాబా పార్ధివ శరీరంలో లేరు. బహుశా ఇది వారి మీద ఆఖరి కాలం కావచ్చు. ఇది నా ఆఖరి వాక్యం - నేను బాబా భక్తుడిని.

ఇప్పుడు రాజశేకర్ పయనమెటు?


Shekar
జీవిత రాజశేకర్ దంపతులు ఎప్పుడు ఎవర్ని పొగుడుతారో, ఎప్పుడు ఎవర్ని తెగుడుతారో ఎవరికీ తెలియదు. మొన్నటిదాకా చిరంజీవిని తిడుతూ వచ్చిన ఈ జంట ఈరోజు జగన్ మీద పడింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే జగన్ పార్టీకి ఈరోజు వీరు గుడ్ బై చెప్పేశారు. ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక లక్ష్యంతోనే జగన్ ఉన్నారనీ, గతంలో ఆయన సభలో అభిమానుల నుంచి తమకు వచ్చిన ఆదరణ చూసి, తట్టుకోలేక తమని నిర్లక్ష్యం చేశారనీ వీరు చెప్పుకొచ్చారు.
వాస్తవానికి, తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటూ, తమకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వీరిద్దరూ కోరుకుంటూవుంటారు. అయితే, జగన్ పార్టీలో ఇప్పటికే రోజా లాంటి సినీతారలు ఉండడంతో వీరికి అక్కడ తగిన గుర్తింపు లభించలేదు. దాంతో వీరు అక్కడ ఇమడలేక బయటకు వచ్చేయాలని నిర్ణయించుకుని, ఈరోజు ఆ పని కాస్తా ఇలా జగన్ మీద ఎటాక్ చేసి, కానిచ్చేశారు. ఇప్పుడీ జంట కాంగ్రెస్ లోకి తిరిగి ఎలాగూ వెళ్ళలేదు. ఎందుకంటే, అక్కడ తమ బద్ధశత్రువు చిరంజీవి వుండనే వున్నాడు. ఇక వీరికి మిగిలింది టీడీపీ ఒక్కటే! అది కూడా మహామహుల సంగమం. అక్కడా సినిమా వాళ్ళు వుండనే వున్నారు. మరి, అక్కడ మాత్రం ఈ జంట ఇమడగలదా?


26, ఏప్రిల్ 2011, మంగళవారం

కడపలో పంచతంత్రం


ఆ ఐదుగురూ ఐదుగురే. ఒక్కోరిదీ ఒక్కో స్టైల్‌. ఎవరి వ్యూహాలు వారివి. ప్రజల పల్సు పట్టేందుకు ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. వీరికి ఎన్ని సానుకూల అంశాలు న్నాయో.. అన్ని ప్రతికూలాంశాలు ఉన్నాయి. వీరికి ఈ ఎన్నికలు ఒక పరీక్ష. ఒక సవాలు. ఇప్పుడు ప్రచారంలో వాటినే ఎదుర్కొంటున్నారు.వచ్చే నెలలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్ధులుగా మారిన ఐదుగురు నేతలు అప్రతిహతంగా, అవి శ్రాంతంగా పోరాడుతున్నారు. పులివెందులలో వదిన -మరిది మధ్య హోరాహోరీ సంగ్రామం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి తనయుడు స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై వైఎస్‌ సోద రుడు, సొంత మరిది వైఎస్‌ వివేకానందరెడ్డి బరిలో ఉన్నా రు. వారిద్దరూ వారి వారి కుటుంబసభ్యుల దన్నుతో ప్రచా రంలో ముందున్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్‌ రవి బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మధ్యనే పోటీ నెలకొంది. వారిద్దరి మధ్య చీలే ఓట్లతో బయటపడాలన్నది బీటెక్‌ రవి ఆశగా కనిపిస్తోంది. విజయ లక్ష్మి మరోసారి సానుభూతి ఓట్లపై ఆశపెట్టుకున్నారు.

ఇక పార్లమెంటు అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ స్వయంగా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మైసురారెడ్డి రంగంలో ఉన్నారు. ముగ్గు రూ అవిశ్రాంతంగా ప్రచారబరిలో దూసుకువెళుతున్నారు.అయితే ఈ ముగ్గురు అభ్యర్ధులకు సొంత జిల్లా కంటే బయట జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం.

అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన జగన్‌కు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ..గురునాధరెడ్డి, కొండా సురేఖ, రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శేషారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, షాజ హాన్‌, శోభానాగిరెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, జూపూడి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు, సినీ నటి రోజా వంటి ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. పులి వెందులలో విజయలక్ష్మికి మద్దతుగా కుటుంబసభ్యులం తా బరిలో నిలిచారు. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. కూతురు షర్మిల ఆమెతోనే ఉంటున్నారు. జగన్‌ ఎక్కువగా తన తండ్రి మృతి చెందిన సానుభూతి ఓట్లపైనే ఆధారపడుతున్నారు.

ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి డీఎల్‌ రవీంద్రారెడ్డికి మద్దతుగా మంత్రులు ప్రచారంలో నిలుస్తున్నారు. ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో.. మంత్రి ధర్మాన ప్రసాదరావు, బొత్స, అహ్మదుల్లా, మోపిదేవి, మహీధర్‌ రెడ్డి, ఆనం, రఘువీరారెడ్డి, గల్లా, మాణిక్యవరప్రసాద్‌, బస్వరాజు సారయ్య వంటి ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే లు కూడా కడపలోనే మోహరించారు. మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలా నికి ఒక్కో ఎమ్మెల్యే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుం డగా, ఈనెల 28 నుంచి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మూడురోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో జగన్‌ కు వచ్చిన ఓట్లలో చీలికతో జగన్‌ గట్టెక్కరని డీఎల్‌ ఆశాభావంతో ఉన్నారు. పులివెందులలో కాంగ్రెస్‌ అభ్యర్ధి వైఎస్‌ వివేకానందరెడ్డి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నా రు. ఆయనకు కుటుంబసభ్యులు దన్నుగా నిలస్తున్నారు. మంత్రులు పులివెందుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

ఇక్కడ విజయలక్ష్మి కంటే వివేకానందరెడ్డే ఎక్కువగా ప్రజలతో ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎం.వి.మైసురారెడ్డి కూ డా అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. నామా నాగేశ్వరరావు, రమేష్‌రాథోడ్‌, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్‌, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌.రమణ, తలసాని శ్రీనివాసయాదవ్‌, రేవంత్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పల్లె రఘునాధరెడ్డి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అబ్దుల్‌ఘనీ, రామకృష్ణ, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, బాబూ రాజేంద్రప్రసాద్‌, సినీ నటి కవిత, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే ఇన్చార్జిగా, వారికి సహాయకులుగా రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Jagans 

       సానుకూలత

  • వైఎస్‌ మృతి సానుభూతి. కొడుకుగా వాటిని పొందే యత్నం.
  • గ్రామ నేతలపై పట్టు. క్రిస్టియన్లు, ముస్లిం ఓటు బ్యాంక్‌.
  • కాంగ్రెస్‌ ఓట్లలో భారీ చీలిక.
  • అంతమంది కలసి ఒక్కడిని ఓడించేందుకు యత్నిస్తున్నారన్న స్థానిక సెంటిమెంట్‌.
  • నాలుగు నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేల బలం.

    ప్రతికూలత
  • గతంలో తనకు వచ్చిన ఓట్ల చీలికతో నష్టం. గెలిస్తే బీజేపీతో కలసిపనిచేస్తారన్న ప్రచారంతో కలవరం. దానివల్ల క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లు దూరమయ్యే ప్రమాదం.
  • తన వర్గీయులపై పోలీసుల కట్టడితో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గే ప్రమాదం. అది తగ్గితే మెజారిటీ ఎంతన్నది అనుమానం.
  • ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటారన్న కారణంతో స్థానికంగా ఉండరన్న విమర్శలు. అవినీతిపరుడన్న ప్రచారం మైనస్‌ పాయింట్‌. ఆరేళ్లలో లక్షకోట్లు అక్రమంగా సంపాదించారన్న విమర్శలు.
  • గతానికి భిన్నంగా కాంగ్రెస్‌-టీడీపీలను ఏకకాలంలో ఎదుర్కోవలసి రావడం.

    డీఎల్‌ రవీంద్రరెడ్డి
  • సానుకూలతravin.(Maidukuru)
  • వివాదరహిత ముద్ర.
  • గతంలో జగన్‌కు పడిన ఓట్ల చీలి కపై ఆశ.
  • ప్రభుత్వ యంత్రాంగం మద్దతు.
  • ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై ఆశ.
  • అందుబాటులో ఉంటారన్న సానుకూలత.

    ప్రతికూలత 
  • ఎవరికీ పనులు చేయరని, అహంకార పూరితంగా వ్యవహరిస్తారని, ఎవరినీ కనీసం గౌరవించరన్న విమర్శలతో కొంత మైనస్‌.
  • సొంత నియోజకవర్గంలోనే పలుకుబడి లేని వైనం. జగన్‌కే ఎక్కువ బలం ఉండటం.
  • ప్రచారంలో జగన్‌ వర్గీయుల నుంచి ప్రతిరోజూ ఎదురీత. ప్రజల నుంచి నిరసనలు.
  • బలవంతంగా పోటీకి దిగారన్న అప్రతిష్ఠ.
  • పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు లేకపోవడం.

    మైసూరారెడ్డి
    mysooraeddyసానుకూలత
  • కడప జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతగా, పాదయాత్రలు చేసిన సీమ నేతగా సుదీర్ఘకాల గుర్తింపు.
  • వివాద రహిత ముద్ర.
  • హంగు, ఆర్భాటాలకు దూరం.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • విశ్వసనీయత కలిగిన నేతగా గుర్తింపు.

    ప్రతికూలత
  • కడప జిల్లాలో ఉండే సమయం తక్కువ.
  • రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ ఎక్కువగా తన నియోజకవర్గ, తన మండలం, తన గ్రామానికే పరిమితం కావడం.
  • సాధారణ నేతల మాదిరిగా జనాలతో మమేకం కాలేకపోవడం.
  • జిల్లా నేతలతో అంతంత మాత్రపు సంబంధాలు.
  • పెద్ద వక్త కాకపోవడం. ఎదుటి వారి మనోభావాలను పట్టించు కోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం.

    వైఎస్‌ విజయలక్ష్మి
    vijyasmaసానుకూలత
  • వైఎస్‌ భార్యగా సానుభూతి.
  • ఎప్పుడూ బయటకు రాని ఆమె ఈ ఎన్నికల్లో ప్రతి గడప ఎక్కడంతో పెరుగుతున్న సానుభూతి.
  • భారీ బలగం ఉన్న కుటుంబసభ్యుల అండ.
  • ఇతరులకు సహాయపడాలన్న తత్వం.
  • వివాదరహిత మనస్తత్వం.

    ప్రతికూలత 
  • ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండటం.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం. వక్త కాకపోవడం.
  • రాజకీయ కుటుంబంలో ఉన్నా రాజకీయాలపై అవగాహన లేకపోవడం.
  • స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
  • ఒకసారి అసెంబ్లీకి గెలిపించినా ఒక్కసారి కూడా సభకు రాలేదన్న అపఖ్యాతి. సానుభూతి ఈసారి ఎన్నికలో పనిచేస్తుందా లేదానన్న సంశయం.

    వైఎస్‌ వివేకానందరెడ్డి
    YS-Vivekanadareddyసానుకూలత 
  • అందరికీ అందుబాటులో ఉండే నైజం.
  • మండలాలు, గ్రామాల్లో అందరినీ పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు, చనువు. విస్తృతమైన బంధుత్వాలు.
  • సమస్యలపై పూర్తి అవగాహన.
  • ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌కు ఆయనే రధసారథి కావడంతో పెద్దగా సమస్యలు లేని సానుకూలత.
  • అవినీతిపరుడన్న ముద్ర లేకపోవడం.

    ప్రతికూలత 
  • వైఎస్‌ కుటుంబంతో విబేధాల వల్ల ఆ కుటుంబ మద్దతు కోల్పోవడం.
  • వైఎస్‌ బంధుగణాలు మూకుమ్మడిగా దూరమవుతున్న వైనం.
  • ఆపదలో అన్న కొడుకుకు అండగా నిలబడలేదన్న అపవాదు.
  • కాంగ్రెస్‌ ఓట్లలో చీలిక.
  • ఇన్నాళ్లూ ‘అన్న’ బలమే తన బలమని భావించారు. ఫలితంగా ఇప్పుడు సొంత వర్గమంటూ లేకపోవడం.

    బీటెక్‌ రవి
    prsonసానుకూలత
  • రాజకీయాలకు కొత్త.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • యువకుడు కావడం.
  • నియోజకవర్గంలో పార్టీకి శాశ్వ త ఓటు బ్యాంకు ఉండటం.
  • ధనబలం ఉండటం.

    ప్రతికూలత
  • సొంత పార్టీలోనే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత.
  • బలమైన వర్గం లేకపోవడం.
  • పార్టీ నేతలతో సంబంధాలు అంతంతమాత్రమే.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం.
  • కొత్త అభ్యర్ధి కావడం, జగన్‌ కుటుంబస్థాయిలో ఆర్థి కంగా బలంగా లేకపోవడం.

19, ఏప్రిల్ 2011, మంగళవారం

మన "అభివృద్ధి" ఎటువైపు?





ప్రపంచం అంతా అభివృద్ధి పధంలోనడుస్తున్న కాలంలో బానిస బ్రతుకుల నుంచి విముక్తికై బ్రిటీష్ వారితో పోరాడటానికే మన కాలం, శక్తీ అంతా సరిపోయింది. గర్వంగా ఏదో సాధించేశామని దాదాపు అర్ధ శతాబ్ధం ప్రపంచం పట్టనట్టు కళ్ళుమూసుకుని, ఇప్పుడిప్పుడే అబ్జివృద్ధి చెందుతున్న దేశాలనుంచి మంచీ. చెడూ రెండూ తీసుకుని, ఆ...మేమూ అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటూ మురిసిపోతున్నాం. అమెరికా లాంటి అగ్ర దేశం సైతం- ఇండియా రాబోయే తరాలకి, అభివృద్ధి చెందిన దేశాలకీ పెద్ద పోటీ అంటూ రోజూ ఎన్నోసందర్భాల్లో చెబుతూనే ఉంది.

మనం నిజమైన అభివృద్ధి పధం వైపు అడుగులు వేస్తున్నామా? లేదా, పై పై మెరుగులు చూసి మురిసిపోతున్నామా? అభివృద్ధి అంటే దేశంలో పెద్ద నగరాల్లో వెలుస్తున్న ఆధునిక కట్టడాలు, విదేశీ సంస్థలు నెలకొల్పుతున్న వ్యపారాల్లో పని చేసి బాగానే సంపాదిస్తున్నాం అనుకోవటం మాత్రమేనా?

ప్రపంచంలో ఇంకా జీవనకోటి కి నాగరికత కూడా తెలియని కాలంలో మన దేశం నాగరీకంగా ఎంతో ముందుంది అని మన చరిత్ర చాటుతూనే ఉంది. కానీ ఈనాడు మనమున్న దుస్థితి చూసుకుని మన చరిత్ర చూసి గర్వపడాలో, అది నాశనం చేసుకుంటున్న మనల్ని చూసి నవ్వుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం.

మన తెలుగుజాతి గర్వించేలా ఎన్నో రంగాల్లో ఎంతో కృషి చేసిన ఎందరో మహనీయులని మనం ఎప్పుడో మరచిపోయాం. నేటి తరానికి వారి పేర్లు కూడా సరిగా తెలియవు, రాబోయే తరాలకి "హ్యారీ పాటర్" తెలిసినంతగా మహా భారతమూ, రామాయణమూ తెలియవు అనటంలో సందేహమే లేదు. అలాంటి మరుగున పడుతున్న మన తెలుగు చరిత్రని తిరిగి గర్వంగా నిలబెట్టే ప్రయత్నం చేయటమే కాదు, అందులో సఫలం అయిన మహనీయులు శ్రీ యన్.టి.రామారావు. ఆనాడు ఆయన రూపుదిద్దిన హైదరాబాద్ నగరంలో ఎందరినో ఆహ్లాద పరచిన మన "ట్యాంక్ బండ్" పై  అనాగరిక ఘట్టం మన అభివృద్ధికి ప్రశ్నార్థకంగా ఉంది.

ఇదేనా మన అభివృద్ధి? అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా మనం పోటీ పడగలమా? ఎందులో? ఈ 21 వ శతాబ్ధంలోనూ కుల, మత, ప్రాంతీయ, భాషా బేధాలతో నిత్యం రగిలిపోతూ, మన చరిత్రని మనమే కూల్చుకుని ఏదో జయించాం, సాధించాం అని సంబరపడుతూ, పిచ్చిగా చిందులు వేస్తూ చేసే ప్రవర్తన అభివృద్ధికి చిహ్నమా?

రాయిలో సైతం దైవం చూసుకుని చేతులెత్తి దణ్ణం పెట్టగలిగే గొప్పతనం ప్రపంచంలో కేవలం మన దేశంలోనే ఉంది. దేశ ఉన్నతికి పాటుపడిన మహనీయులతో సమకాలీకులుగా పుట్టలేక పోవటం దురదృష్టం. కనీసం వారు పోయాక వారి చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ప్రాణం లేని విగ్రహాలలోనైన వారిని సజీవంగా చూసుకునే భాగ్యం కలగటం అదృష్టం. అలాంటి పవిత్ర మూర్తుల విగ్రహాలని ఈనాడు కూల్చినది రాజ్యాలు కబళించి సంపద దోచుకుపోతూ పట్టుకు పోలేక కూల్చి సంబర పడ్డ ఏ పరదేశీయులో కాదు, మనమే. అభివృద్ధి చెందిన దేశాలతో అక్కడి పౌరులతో సైతం పోటీ పడగలం అని గర్వంగ చెప్పుకు తిరిగే మన తెలుగు జాతీయులమే. మన చరిత్రని మనమే కూల్చుకుంటున్నాం. నాగరికత చుట్టూ ఉన్న పరిసరాల్లో లేదు, ఆ పరిసరాల్లో కలసి జీవిచే పౌరులలో ఉంది. అభివృద్ధి జీవంలేని కట్టడాల్లో లేదు, జీవమున్న మన ప్రవర్తనలోనే ఉంది.

"దేశమంటే మట్టికాదోయ్...దేశమంటే మనుషులోయ్..." అన్న గురజాడ గారి మాటల్లో ఎంతటి సత్యముందో నిన్నటి మన "ట్యాంక్ బండ్ ఘట్టం" నిరూపించింది.

ఇన్నేళ్ళూ జరుగుతున్న అభివృద్ధినీ, తెలుగుజాతి ఎదుగుదలనీ చూసి సంబరపడుతూ నగరం నడిబొడ్డున కొలువై ఒకప్పుడు జీవంలేని ఆ జలాశయానికి జీవం తెచ్చి ఎందరినో ఆహ్లాద పరుస్తూ కళ కళ లాడిన తెలుగు మహనీయులు ఇక మా తెలుగువారి అభివృద్ధిని చూడలేం అంటూ వారి చేతుల్లోనే నేలకొరిగి నేడు నిజంగా అమరులయ్యారు.

"If you admire kings and Emperors for historical constructions like Golkonda and Charminar in Hyderabad, you should also admire NTR for bringing in monuments of Great Telugu Personalities on the TankBund."

"దేవుడా రక్షించు నా దేశాన్ని. ఈసారి శతృనేతల బారినుంచి కాదు, నా దేశ పౌరుల దాడి నుంచే"