18, మార్చి 2011, శుక్రవారం

వేశ్యల జీవితాలతో NGOల చెలగాటం

కేరళ రాష్ట్రానికి టూరిజం నుంచి భారీగా ఆదాయం వస్తోంది. ఆ రాష్ట్రానికి వచ్చే టూరిస్ట్‌లతో వేశ్యావృత్తి కూడా లాభదాయక వ్యాపారంగా సాగుతోంది. కేరళలో పోలీసులు ఒక వ్యభిచార గృహంపై దాడి చేసి వేశ్యలని అరెస్ట్ చేసి తరువాత ఒక NGO ఆధీనంలోని రెస్క్యూ హోమ్‌కి తరలించారు. ఆ రెస్క్యూ హోమ్‌లో కనిష్ఠ సౌకర్యాలు లేవు. అక్కడ కొన్ని రోజులు ఉన్న వేశ్యలు తరువాత పారిపోయి తిరిగి వ్యభిచార గృహానికి వెళ్లిపోయారు. వాళ్లు పారిపోయినా ఆ NGO నిర్వాహకులకి నష్టం లేదు. ఆ NGOలకి తాము విరాళాల రూపంలో సంపాదించిన విదేశీ నిధులతో వేశ్యలకి తిండి పెట్టాల్సిన ఖర్చు మిగులుతుంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కటా లాంటి నగరాలలో ఇంకో రకం NGOలు ఉన్నాయి. వేశ్యలకి కాండొమ్స్ ఇచ్చి వాళ్లని సుఖ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడమంటాయి. కానీ వాళ్లని వేశ్యావృత్తి నుంచి బయటకి తీసుకురావడానికి ప్రయత్నించవు. అంతే కాకుండా ఈ సంస్థలు వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చేస్తాయి. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే మగవాళ్లకే లాభం. పోలీస్ కేసులకి భయపడకుండా వేశ్యాగృహాలలో దూరొచ్చు. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసినంతమాత్రాన వేశ్యలకి ఏదో గౌరవం వస్తుందని అనుకోను. నీతి విషయంలో స్త్రీ-పురుష సమానత్వం లేని సమాజంలో వేశ్యలకి ఏదో గౌరవం ఇస్తారనుకుంటే అది ఇంకా జోకు.

ప్రాంతీయతత్వం రెండు ప్రాంతాలవాళ్లలోనూ ఉంటే ఎవరిని తప్పుపట్టగలము?

సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం విజయవాడలో ఉంటే కోస్తా ఆంధ్ర ప్రాంతీయవాదులూ అతని విగ్రహాన్ని ద్వంసం చేసేవాళ్లు. సమైక్యవాద ఉద్యమంలో ఎన్నడూ పని చెయ్యని వీరేశలింగం లాంటి వారి విగ్రహాలని ద్వంసం చెయ్యడం తప్పే. కానీ ప్రాంతీయతత్వం రెండు ప్రాంతాలవాళ్లలోనూ ఉన్నప్పుడు ఎవరిని తప్పుపట్టగలము? పూర్వం భింద్రన్‌వాలే అనే సిక్కు చాంధసవాది ఉండేవాడు. సిక్కు మతం ప్రకారం జుట్టు కత్తిరించుకోవడం నిషిద్ధం అని హిందువులు కూడా జుట్టు కత్తిరించుకోకూడదు అనేవాడు. హిందువులు కూడా శుద్ధ ఖల్సా సంప్రదాయాలు పాటించాలనేవాడు. తెలంగాణావాళ్లు తాము విడిపోతామంటోంటే బలవంతంగా కలిసి ఉండమనడం ఎలా ఉందంటే హిందువులకి జుట్టు పెంచుకోమని సిక్కులు బలవంతం చేసినట్టు ఉంది. విగ్రహాలు ద్వంసం చేసినవాళ్లు తెలంగాణా తాలిబాన్‌లైతే మనం ఆంధ్రా భింద్రన్‌వాలేలము కదా. హిపోక్రిసీ లేకుండా నిజం ఒప్పుకుందాం, మన ప్రాంతంవాళ్లలోనూ ప్రాంతీయతత్వం ఉందని.