8, జనవరి 2011, శనివారం

మా ఉళ్ళోసంక్రాంతి పండుగ హడావిడి ...........

మా ఉళ్ళోసంక్రాంతి పండుగ హడావిడి .


ఊళ్ళలో "సంక్రాంతి పండుగ" రాబోతుందంగానే క్రిందట నెలనుండే అంటే డిసెంబర్ 15నుండి నెల పట్టడము(ధనుర్మాసం ప్రారంభం) జరుగుతుంది .సంక్రాంతి పండుగహడావిడి మొదలౌతుంది



నెలపట్టడమంటే..ఈ నెల రోజులూ ఏ విధమైన శుభకార్యములూ లేకుండా కేవలము పండుగ మీదే దృష్టి పెట్టడము అని అర్ధం .

ఇంటిముందు ముగ్గుల్ని డిసెంబర్ 16 నుంచి ప్రారంభించి పెడతారు. అప్పటివరకు ముగ్గు లు ఎలా పెట్టినా..ఈ పండగ నెల రోజులూ మాత్రం ,వాకిళ్ళలో పేడతో చిక్కగా కల్లాపి జల్లి ,పిండితో రోజూ రకరకాలు ముగ్గులు పెడుతుంటారు.ఈ రోజుల్లో పెట్టే ముగ్గులు ఎక్కువగా గీతలతో పెడతారు .వాటిలో తాబేలు ముగ్గు ,తేలు,పాము ముగ్గు,చాలా బాగుంటాయి .అవి ఎక్కువగా పెడతుంటారు కూడా .
ఈ నెల రోజులూ ...హరిదాసు కీర్తనలతో ,జంగమ దేవరల గంటల సవ్వడి తో మా ఊరు బలే సందడిగా ఉంటుంది. .


 
ముగ్గులు పెట్టడమే కాకుండా పండగ కు ఇళ్ళు శుబ్రం చేయడంకూడా ఓ పెద్ద పని .కొందరైతే అటకు పైనున్న ఇత్తడి సామాను కూడా తోమించుకుంటారు. మా ఉళ్ళో ఐతే ఇంటి గోడలతో సహా గీకి గీకి మరీ కడిగేస్తారు.

ఇక ఇళ్ళు ,వాకిళ్ళు ...తోముళ్ళు, శుబ్రాలైపోయాక చేసే ముఖ్యమైన పని పిండివంటలు చేసుకోవడం.

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా పల్లెటూర్లలో రకరకాల పిండివంటలు చేస్తారనీ , అరిసెలు వండని ఇల్లు ఉండదనీ అందరికీ తెలిసిన విషయమే .మా ఊళ్ళోనూ అంతే .సంక్రాంతి పండుగకు వారం ముందుగానే ప్రతీ ఇంటిలోనూ అరిసెలు వండే హడావిడి మొదలవుతుంది . రోజూ ఉదయం ఎవరో ఒకరి ఇంటినుండి రోకళ్ళతో పిండి దంచుతున్న చప్పుళ్ళు వినపడుతూ ఉంటాయి .పిండి ఆడే మిల్లు ఉన్నా కానీ రోట్లో దంచిన పిండి తోనే అరిసె లు బాగా వస్తాయని, చాలా మంది ఇలానే చేస్తారు  అంతే .అవేకాకుండా కరకజ్జం అంటే మిటాయచ్చు ,పాకుండలు చేస్తాం ..

ఈ పండగ పనులన్నీ అయ్యాక చదువులకోసం హాస్టల్ కి వెళ్ళిన పిల్లల కోసం ,ఉద్యోగాల కొరకు పట్టణాల కెళ్ళిన వాళ్ళకోసం తల్లితండ్రులు ఎదురు చూస్తుండగానే సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. ఇక ఆ మూడు రోజులు మా ఊరు బలే సందడిగా ఉంటుంది.

ఓ ప్రియతమా..

ఓ ప్రియతమా..


పేపర్లో చదివిన చిన్న కవితకు ఓ రోజంతా కష్టపడి,నా మైండ్ కి కాస్త పని కల్పించి ఈ రూపం తెచ్చా... ఆఖరి రెండు లైన్లూ నేను చదివిన కవితలోనివి.

నా ఈ ప్రయత్నం ఎలా ఉందో మొహమాట పడకుండా చెప్పండే .

సందె గాలిలో సన్నజాజి సుగంధంలా
మలి సంధ్య లో మలయ మారుతంలా
మొగలి రేకుల పరిమళాలతో నను తాకిన ఓ ప్రియతమా !

నీ నవ్వుతో కోటి సరాగాల వీణలు వాయించావు
నీ స్పర్శతో వేయి వేణువులు ఉదావు
నీచూపుతో నాలో వందలాది తంబురాలు మోగించావు
నీ సిగ్గులో ఎన్ని సితారలో పలికించావు

నీ కులుకుల నడకల హోయలతో నన్ను గిలిగింతలు పెట్టావు
నీ తియ్యని పలుకులతో నా మది దోచావు
నీవు మిగిల్చిన జ్ఞాపకాలతో
నా జీవితం ఓ సరికొత్త రాగంలో పాటలా ఇలా సాగిపోతుంటే

ఈ మైమరుపు వెన్నెలలో ఆ మైమరపించే జాబిలీ కంటే
నీ మదుర స్మృతులే ఇక నా జీవన పయనానికి ఆలంబన