28, జూన్ 2011, మంగళవారం

సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా బలమైన జాతిని నిర్మించిన స్టాలిన్

రష్యాలో సోషలిస్ట్ విప్లవం వచ్చినప్పుడు  తొలినాళ్లలో విప్లవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ చక్రవర్తుల అనుకూల వర్గంవాళ్లు తిరిగుబాటు చేశారు. ఆ సమయంలో ప్రతిరోధక శక్తులకి సామ్రాజ్యవాద దేశాలు మద్దతు ఇచ్చాయి.  బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రతిరోధక శక్తులకి మద్దతుగా తమ సైన్యాలని పంపాయి. అది వరకు మొదటి ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా బాగా నష్టపోయిన సామ్రాజ్యవాదులకి కొత్తగా రష్యాపై దాడి చెయ్యడం  పెద్ద ఖర్చు వ్యవహారమనిపించింది. దాంతో సామ్రాజ్యవాదులు రష్యా నుంచి తమ సైన్యాలని ఉపసంహరించుకున్నారు. సామ్రాజ్యవాదులు రష్యాపై ఎప్పటికైనా తిరిగి దాడి చేస్తారని స్టాలిన్ ముందే ఊహించాడు. సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా దేశాన్ని సంసిద్ధం చెయ్యాలంటే దేశాన్ని ఆర్థికంగా బలపరచాలి. దేశాన్ని ఆర్థికంగా బలపరచాలంటే దేశాన్ని పారిశ్రామీకరించాలి, వ్యవసాయాన్ని కూడా సమిష్టీకరించాలి. వ్యవసాయాన్ని సమిష్టీకరించడానికి అక్కడి మధ్య తరగతి రైతులు ఒప్పుకోలేదు. ప్రభుత్వం ఆ రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కుని వాటిని సమిష్టీకరించాల్సి వచ్చింది. తిరుగుబాటు చేసిన రైతుల్ని అరెస్ట్ చేయ్యడం లేదా పార్టీ కార్యకర్తల సహాయంతో బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. 1927 తరువాత రష్యాలో వేగంగా పారిశ్రామీకరణ, వ్యవసాయ సమిష్టీకరణ జరిగాయి. 1933లో రష్యాలోని పారిశ్రామీకరణ చూసి సామ్రాజ్యవాద దేశాలన్నీ భయపడ్డాయి. అదే సమయంలో జెర్మనీలో తీవ్రమైన anti-communist inclinations కలిగిన నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. రష్యాపై దాడి చేసే పని నాజీ సామ్రాజ్యవాదులు చూసుకుంటారని ఇతర సామ్రాజ్యవాద దేశాలు అనుకున్నాయి. నిజానికి నాజీ నియంత హిట్లర్ కంటే తీవ్రమైన anti-communist inclinations ఉన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాద నాయకుడు విన్స్టన్ చర్చిల్. అతను విప్లవ ప్రభుత్వాలని పురిట్లోనే చంపెయ్యాలని వాదించేవాడు. హిట్లర్ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రభావంతో సామ్రాజ్యవాదిగా ఎదిగాడు కానీ తన ఎదుగుదలని ప్రభావితం చేసిన బ్రిటిష్ సామ్రాజ్యం పైనే దాడి చెయ్యాలనుకున్నాడు. చివరికి హిట్లర్‌ని ఓడించడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు స్టాలిన్‌తో చేతులు కలపాసి వచ్చింది. 1940 నాటికి రష్యాలో విప్లవ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించింది. నిరుద్యోగాన్ని పూర్తిగా మాయం చేసింది. 1933 సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 20 నుంచి 30 శాతం నిరుద్యోగం ఉండేది. తమ దేశంలో విప్లవం రాకుండా ఉండేందుకు USA పాలక వర్గం కూడా నిరుద్యోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. నాజీ సైన్యాలు USAపై కూడా దాడి చెయ్యడంతో USA కూడా రెండవ ప్రపంచ యుద్ధంలోకి దిగి నాజీ కూటమిలో భాగమైన జపాన్‌పై దాడి చేశాయి. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. రష్యా గెలిచింది కానీ నాజీ బాంబు దాడులకి రష్యా కూడా ఆర్థికంగా నష్టపోయింది. నాజీలు ఫాక్టరీలతో పాటు వ్యవసాయ క్షేత్రాలపై కూడా బాంబులు వేశారు. 1940లో ప్రపంచంలోని 40% వ్యవసాయ ఎగుమతులు రష్యా నుంచే జరిగేవి. వ్యవసాయ క్షేత్రాలు బాంబు దాడుదలలో ద్వంసం కావడంతో వ్యవసాయ ఎగుమతులు భారీగా క్షీణించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత టైమ్‌లో సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లలో 80% మంది ప్రజలు పట్టణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు. అప్పటికీ USAలో పట్టణీకరణ 64% దాటలేదు.  సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లు USA కంటే వేగంగా పట్టణీకరణ చెందాయి కానీ దక్షిణ రిపబ్లిక్‌లు వ్యవసాయంపై భారీగా ఆధారపడ్డాయి. తజికిస్తాన్ రిపబ్లిక్‌లో పట్టణీకరణ కేవలం 33% ఉండేది. తుర్క్‌మెనిస్తాన్ రిపబ్లిక్‌లో ఎడారి భూములు ఎక్కువగా ఉండడంతో అక్కడ భారీ పరిశ్రమలు పెట్టలేకపోయారు. స్టాలిన్ రష్యాని పారిశ్రామీకరించినప్పటికీ ప్రాంతీయ అసమానతలని నిర్మూలించలేకపోయాడు. ఒకప్పుడు కజక్‌స్తాన్ ప్రాంతంలో పశువులని పోషించుకుంటూ, జంతువులని వేటాడుకుంటూ తిరిగిన సంచార జాతుల వారికి  స్థిర నివాసాలు కల్పించడం జరిగింది కానీ వారు ఇప్పటికీ తమ సంప్రదాయమైన వేట మానలేదు. సాంస్కృతికంగా కూడా దక్షిణ రిపబ్లిక్‌లు వెనుకబడి ఉండేవి. దక్షిణ రిపబ్లిక్‌లు ఆర్థికంగా & సాంస్కృతికంగా వెనుకబడి ఉండడంతో 1990లో సోవియట్ సమాఖ్యని విచ్ఛితి చెయ్యడం సాధ్యమయ్యింది. సోవియట్ సమాఖ్య విచ్ఛిన్నమైనా ఆ సమాఖ్య సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహంలా గర్జించింది అనే విషయాన్ని మర్చిపోలేము.

26, జూన్ 2011, ఆదివారం

అన్నమో


లేక..,, ఏసూ, అల్లా, యాహ్వే,గాడ్...ఎవరైనా...

ప్రపంచవ్యాప్తంగా ఆకలి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. 2015 నాటికి ఆకలిబారిన పడుతున్న వారి సంఖ్యని సగానికి తగ్గించాలని 1996 ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫూడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ - ఎఫ్.ఎ.ఒ) ప్రపంచంలో ఆకలి బారిన పడుతున్న వారి సంఖ్య 2007లో 92.3 కోట్లు నుండి 2008లో 96.30 కోట్లకి పెరిగిందనీ, 2009 ఆర్ధిక సంక్షోభం దీనిని మరో 4 కోట్లు పెంచొచ్చని అంచనా వేసింది.అంటే ప్రపంచమంతటా ఆకలిబారిన పడేవారి సంఖ్య 100 కోట్ల వరకు చేరిందని అర్ధం (ప్రపంచ జనాభా సుమారు 600కోట్లు!).

ఇంకా ఉండొచ్చు!

ఆహార ధాన్యాల ధరలు పెరిగితే పేదలకు ఆహార లభ్యత తగ్గుతుందన్న సూత్రీకరణ ఆధారంగా ఈగణాంకాలు రూపొందుతాయి.ధరల ప్రాతిపధికగాగణించే ఈ లెక్కలు పరిస్థితి తీవ్రతను తక్కువగా చేసి చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్టులో గత మూడేళ్ళుగా మూడు రెట్లు పెరిగిన గోధుమ, బియ్యం ధరలు ఈ సంవత్సరం (2009) కొద్దిగా తగ్గాయి. అయితే ఆసియా దేశాలలో వీటి ధరలు పెరిగాయి. అందువల్ల దారిద్ర్యంలోకి నెట్టబడిన లక్షలాది మంది పై నివేదికల గణాంకాల్లో చేరరు.
2007గాను రికార్డు స్థాయిలో 230 కోట్ల టన్నుల ఆహర ధాన్యాలు పండాయి. అంతకు ముందు ఏడాది కంటే ఇది 4 శాతం అధికం. 2008లో ఇది మరో 2 శాతం పెరిగింది. ఈ ఏడాది ఆహారధ్యాన్యాల దిగుబడి కనీసం గత ఏడాది స్థాయిలో ఉండగలదని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా, 1961 నుంచి నేటి వరకు ఆహారధాన్యాల దిగుబడి మూడు రెట్లు పెరగ్గా, జనాభా మాత్రం రెట్టింపు మాత్రమే పెరిగింది. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే ప్రపంచ ప్రజలందరి కడుపు నింపగల ఆహార ధాన్యాలున్నాయి. అయితే ఇవి అందాల్సిన వారికిఅందకపోవడం వల్లే సమస్యంతా.

కారణాలు - కథలు, కాకరకాయలు

ప్రపంచంలో ఆకలి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంపై కల్లబొల్లి కారణాలు చెబుతున్నారు - కరువు, వరదలు వంటి సమస్యలతో పంటలు దెబ్బతినటం, భారత్, చైనాలలోని ప్రజలు ఇదివరకటి కంటే ఎక్కువ తినటం వగైరా; సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఫలితంగా వెనుకబడిన దేశాల ప్రజల ఆధాయాలు పెరిగినందున, వారెక్కువ ఆహారధన్యాలు వినియోగించుకుంటున్నారన్నదివాదన (2008 చివర్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసినమోసపూరిత వాదన ఇది. దీనికి విరుద్ధంగా ఊబకాయ పీడితులవుతున్న అమెరికన్లు తిండిపోతులన్న అసలు కారణాన్ని విస్మరించారు.) ఈ గణాంకాలునిజమే అయినా ఆకలి, ఆహార ధరలనువివరించే కారణాలు కావని గ్రహించాలి.ధనిక వర్గాల ఆహార వినియోగం పెరిగిందన్నది వాస్తవమే. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న ధరల కారణంగా పేదలు తగినంత ఆహారం పొందలేక పోతున్నారన్నది కూడా యధార్థమే. ప్రపంచంలోనే సంపన్న దేశంగా అలరారుతున్న అమెరికాలో సయితం 10శాతం జనాభా అర్ధాకలితో అలమటిస్తున్నారన్నది కూడా వాస్తవమే.

అసలు విషయాలు

ఆహార ధాన్యాల ధరలను, ఆహారభద్రతను ప్రభావితం చేస్తున్న ఒక అంశం జీవ ఇంధన ఉత్పత్తి కొరకు సారవంతమైన భూములను వినియోగించడం. మొక్కజొన్న నుండి తయారు చేసేబయో డీజిల్ వాడకం ద్వారా బొగ్గు, పెట్రోలు వంటి భూగర్భ వనరుల వినియోగాన్ని తగ్గించాలనిఅమెరికా, మరియు ముఖ్యంగా యురోపియన్ యూనియన్ దేశాలు తీసుకున్న నిర్ణయంతో సారవంతమైన భూములు ప్రజల ఆహార అవసరాలకు కాక కార్లు నడపడానికి డీజిల్ పండించే భూములుగా మారిపోయాయి. దీనితో ఆహార ధాన్యాల దిగుమతి తగ్గి, ధరలు పెరుగుతున్నాయి.
డెబ్బయవ దశకంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి రుద్దిన వాణిజ్య సరళీకరణ, వ్యవస్థాగత సర్దుబాట్ల కార్యక్రమాలు పెరిగి పెద్దవయ్యాయి. 90వ దశకంలో వాణిజ్య సంస్థల విధానాలతో, జన్యుమార్పిడి పంటలతో ప్రపంచమంతా ఆకలి సంక్షోభం తీవ్రమయింది.
ఒకమారు హైతీ ఉదంతాన్ని పరిశీలిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. దశాబ్దాల క్రిందట వరి పంట సమృద్ధిగా ఉన్న దేశం హైతీ. దిగుమతులపై ఆంక్షలను 1994లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయం అందించి తొలగింప చేసింది. అమెరికా ప్రభుత్వం విపరీతంగా సబ్సిడీ ఇచ్చి చౌక ధరల వరి ఎగుమతులతో హైతీని నింపేసింది. దాంతో లాటిన్ అమెరికాలో అతి చిన్న దేశమైన హైతీలో వరిపంట అదృశ్యమైపోయింది. ఆ తరువాత అక్కడ వరి ధరలు పెరిగిపోయాయి. ప్రజలు కొనలేక విధుల్లోకొచ్చి పోరాటాలకు దిగారు.
ఇదే విధంగా పశ్చిమాఫ్రికాలోని మారిటానియా నుండి బుర్కినాఫాసో వరకు ఉన్న దేశాలలో వరిపంట నాశానమైపోయి ప్రజలు వీధుల్లోకొచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
అన్నమో రామచంద్రా! అన్నది ప్రపంచంలో వందకోట్ల మంది ఆకలి కేకలు! ఆహారం - ఆకలి అనే ఈ సంక్షోభ స్వభావాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది

సావిత్రి జీవితం


సినీ సామ్రాజ్ఞి....సావిత్రి

savitri in a movie stillతెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్నిఅలరించారు మహానటి సావిత్రి. తెలుగు వారు మరచిపోలేని పాత్ర "దేవదాసు"లోని పారు. ఇఫ్పటికీ వన్నె తరగని చిత్రమది. అలాగే "మాయాబజార్"లోని శశిరేఖ పాత్ర. ఇప్పటికీ "అహనా పెళ్ళంట...." పాటని ఆ సన్నివేశాన్ని ఎవరూ మరువలేరు . చూపులతో, పెదవి కదలికలతో, తన నటనతో ఎందరినో మంత్రముగ్ధులను చేశారు ఆమె. "నర్తనశాల", "శ్రీకృష్ణపాండవీయం", "సుమంగళి", "నాదీ ఆడజన్మే", "నవరాత్రి" ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఆమె నటనాకౌశలానికి దీపికలు. "దొంగరాముడు", "తోడికోడళ్ళు", "అభిమానం", "మురిపించేమువ్వలు(1960)", "మంచిమనసులు(1961)", "డా. చక్రవర్తి (1964)", "దేవత(1965)", "మనసే మందిరం (1971)"... వంటి చిత్రాలు ఆమె నటనకి మైలు రాళ్ళు. తెలుగు తమిళ, హిందీ చిత్రాలన్నిటిలో కలిపి 318 సినిమాలలో నటించారు. హిందీలో "బహుత్ దిన్ హుమై", "ఘర్ బసాకే దేఖో", "బలరామ్ శ్రీకృష్ణ", "గంగాకి లహరే" మొదలైన చిత్రాలు చేశారు. సావిత్రిని దక్షిణాది మీనాకుమారిగా అభివర్ణించేవారు.

తెరవెనుక పాత్రల్లో

దర్శకురాలిగా : మాతృదేవత, వింత సంసారం, చిన్నారి పాపలు, చిరంజీవి మొదలైన చిత్రాలు.

నిర్మాతగా: చిన్నారి పాపలు, ఏక్ చిట్టీ ప్యార్ భరీ చిత్రం బాగుందన్నా... ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది.

గాయనిగా: నవరాత్రి సినిమాలో ఒక పాట పాడారు.

బిరుదులు, అవార్డులు

తమిళ్ రాష్ర్ర ప్రభుత్వంచే కలైమామణి...

నడిగర్ తిలగమ్...

నటశిరోమణి...

మహానటి....

ఉత్తమ నటీమణి...

ఇంకా ఎన్నో అవార్డులు అందుకున్నారు....
ఎవ్వరూ ఇవ్వలేని, స్వయంగా సంపాదించుకున్న అవార్డు/రివార్డు "ప్రజల హృదయాలలో చిరంజీవి"గా నిలిచిపోవడమే ఆమెకు అసలైన అవార్డు.

జగతి మరువలేని నటి సావిత్రి . ఆమే నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె "జీవించిన" చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. అమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి.
సావిత్రి పుట్టిననెల గిట్టిన నెల డిసెంబరు మాసం కావటం కాకతాళీయం. జననం డిసెంబరు 6,1937 - మరణం డిసెంబరు 26, 1981 (శనివారం). ఆమె జీవిత కాలం కేవలం 44సంవత్సరాలు మాత్రమే.

బాల్యం

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న నిస్సాంకురమ్ గురవయ్య, సుభద్రమ్మలకు జన్నించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చారు. నందమూరి తారకరామారావు, జగ్గయ్య వంటి మహా నటులు ఆరోజుల్లో నడిపిన నాటక ప్రదర్శనలలోనూ స్టేజీమీద ప్రదర్శనలిచ్చారు. తరువాత కాలంలో "నవభారత నాట్యమండలి" అనే నాటక కంపెనీ స్ధాపించారు. బుజ్జిబాబు రచించిన "ఆత్మ వంచన" నాటకం ప్రదర్శన ప్రసిద్ధి చెందింది.
12 సంవత్సరాల వయస్సులో మద్రాసు చేరిన ఆమె సినిమాలలో ప్రయత్నం చేశారు. తెలుగులో తొలి అవకాశం యల్.వి.ప్రసాద్ గారి "సంసారం" సినిమాలో లభించింది. 1949లో "అగ్ని పరీక్ష"లో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేక ఆపాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయలేదు. అనంతరం "పాతాళభైరవి" చిత్రంలో నృత్యపాత్రలో కనిపించారు. అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె నట జీవితం "పెళ్ళిచేసి చూడు", "అర్ధాంగి", "మిస్సమ్మ" ఇలా ఎన్నో సినిమాలతో ఎదిగి, మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మహానటిగా నిలబెట్టింది. ఆమె తెలుగుతో పాటు తమిళ సినిమాలలోనూ తిరుగులేని నటీమణి. ఆమె తొలుత ప్రముఖ తమిళ హీరో జెమినీగణేష్ తోనూ, శివాజీ గణేశన్ తోనూ అనేక చిత్రాలలో నటించారు.

వివాహ జీవితం

"మనంపోల మాంగల్యమ్(1953)" తమిళ సినిమాలో ఆమె నటించారు. హీరో జెమినీ గణేష్. ఆ సమయంలోనే ప్రేమ మత్తులో పడి 1953లోనే ఆమె జెమినీ గణేష్ ని వివాహం చేసుకున్నారు. కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ లను చాలా స్ట్రిక్ట్‌గా డిసిప్లిన్‌తో పెంచారు. టి.వి.లు లేని ఆరోజుల్లో 16ఎం.ఎం. ప్రొజెక్టర్ పెట్టి ఇంట్లోనే సినిమాలు చూసేవారు.savithri giving her gold arnaments to Prime Ministers Relief Fund in the presence of PM Lal Bahadur Sastri
అడిగినవారికి లేదనకుండా దానమిచ్చే దానశీలి సావిత్రి. లాల్ బహుదూర్ శాస్తిగారి సమక్షంలో తన వంటిమీదున్న నగలని ప్రధాన మంత్రి సహాయ నిధికి దానమిచ్చారు. ఆమె సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చయ్యేది. అందరినీ నమ్మేవారు.

అభిరుచులు....

ఆమెకి క్రికెట్ అన్నా, ఛెస్ అటలంటే ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ. పిల్లలని ప్రేమతో చూసుకునేవారు.
తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి తెలుగు సినీ సామ్రాజ్ఞి. సినీ జీవితంలో అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినా,నిజ జీవితంలో అతిఘోరంగా విఫలమైయ్యరు. చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె జీవిత చరమాంకం అందరికీ ఒక పాఠం. ఆమె నటజీవితం ఎందరో నటీమణులకి మార్గదర్శకం.

సావిత్రి జీవితం - చరమాంకం

"మనంపోల మాంగల్యమ్(1953)" తమిళ సినిమాలో ఆమె నటించే సమయంలోనే.హీరో జెమినీ గణేష్ ప్రేమ మత్తులో పడి ఆమె ఆయనను వివాహం చేసుకున్నారు. ఎంతో ఇష్టపడి, ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె వైవాహిక జీవితం మాత్రం ముళ్ళబాటలోనే నడిచింది. వివాహ సంబంధాలు ఇరువురి మధ్య తెగిపోయాయి. నమ్మిన వ్యక్తులే మోసపుచ్చి ఆమెను నట్టేట ముంచారు . ఎంతో సంపన్నురాలైన ఆమె వ్యాపారాలపేరిట, దానాలపేరిట, మోసాలపాలై, ఇలా సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. జీవితంలో తట్టుకోలేని సమస్యలు, మెంటల్ టెన్షన్ లు ఎక్కువయ్యాయి. చివరికి వ్యసనాలకు బానిస అయ్యారు. తాగుడు, నిద్రమాత్రలు, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడ్డారు. అనేక మార్లు ఆస్పత్రిలో చేరి చికిత్సనూ పొందారు. డాక్టర్లు మత్తు పదార్ధాలు వలదని వారించినా ఫలితం లేకపోయేది.
చివరిసారిగా ఆమె బెంగుళూరు సమీపంలో తెలుగు చిత్రానికి షూటింగ్‌లో పాల్గొనటానికి వెళ్లి (మత్తులో) పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్ధురాలు కూడా అయిన ఆమె అంతిమ దశలోకి (టర్మినల్ కోమా) చేరుకున్నారు. ఆమె మరణించడానికి ముందు సినీ పరిశ్రమ నుంచి (సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛేంబర్ గోల్డెన్ కమిటీ) ఆమెకి 10,000 రూపాయలు విరాళం అంధింది. అవి ఆమె వైద్యానికి ఎంత మాత్రం సహాయ పడ్డాయో తెలియదు. ఇద్దరు పిల్లలు, నర్సు సంరక్షణలో, అద్దె భవనంలో అతి భయంకరమైన పరిస్ధితిలో.... దాదాపు 18 నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం డిసెంబరు 26, 1981, శనివారు రాత్రి 11గం.లకు తుది శ్వాస విడిచారు

మహానటి సావిత్రి


మహానటి సావిత్రి ఒక నిజమైన లెజండ్

By కె, మణినాథ్

జగతి మరువలేని నటి సావిత్రి . ఆమే నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె "జీవించిన" చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. అమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి.
సావిత్రి పుట్టిననెల గిట్టిన నెల డిసెంబరు మాసం కావటం కాకతాళీయం. జననం డిసెంబరు 6,1937 - మరణం డిసెంబరు 26, 1981 (శనివారం). ఆమె జీవిత కాలం కేవలం 44సంవత్సరాలు మాత్రమే.

బాల్యం

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న నిస్సాంకురమ్ గురవయ్య, సుభద్రమ్మలకు జన్నించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చారు. నందమూరి తారకరామారావు, జగ్గయ్య వంటి మహా నటులు ఆరోజుల్లో నడిపిన నాటక ప్రదర్శనలలోనూ స్టేజీమీద ప్రదర్శనలిచ్చారు. తరువాత కాలంలో "నవభారత నాట్యమండలి" అనే నాటక కంపెనీ స్ధాపించారు. బుజ్జిబాబు రచించిన "ఆత్మ వంచన" నాటకం ప్రదర్శన ప్రసిద్ధి చెందింది.
12 సంవత్సరాల వయస్సులో మద్రాసు చేరిన ఆమె సినిమాలలో ప్రయత్నం చేశారు. తెలుగులో తొలి అవకాశం యల్.వి.ప్రసాద్ గారి "సంసారం" సినిమాలో లభించింది. 1949లో "అగ్ని పరీక్ష"లో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేక ఆపాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయలేదు. అనంతరం "పాతాళభైరవి" చిత్రంలో నృత్యపాత్రలో కనిపించారు. అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె నట జీవితం "పెళ్ళిచేసి చూడు", "అర్ధాంగి", "మిస్సమ్మ" ఇలా ఎన్నో సినిమాలతో ఎదిగి, మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మహానటిగా నిలబెట్టింది. ఆమె తెలుగుతో పాటు తమిళ సినిమాలలోనూ తిరుగులేని నటీమణి. ఆమె తొలుత ప్రముఖ తమిళ హీరో జెమినీగణేష్ తోనూ, శివాజీ గణేశన్ తోనూ అనేక చిత్రాలలో నటించారు.

వివాహ జీవితం

"మనంపోల మాంగల్యమ్(1953)" తమిళ సినిమాలో ఆమె నటించారు. హీరో జెమినీ గణేష్. ఆ సమయంలోనే ప్రేమ మత్తులో పడి 1953లోనే ఆమె జెమినీ గణేష్ ని వివాహం చేసుకున్నారు. కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ లను చాలా స్ట్రిక్ట్‌గా డిసిప్లిన్‌తో పెంచారు. టి.వి.లు లేని ఆరోజుల్లో 16ఎం.ఎం. ప్రొజెక్టర్ పెట్టి ఇంట్లోనే సినిమాలు చూసేవారు.savithri giving her gold arnaments to Prime Ministers Relief Fund in the presence of PM Lal Bahadur Sastri
అడిగినవారికి లేదనకుండా దానమిచ్చే దానశీలి సావిత్రి. లాల్ బహుదూర్ శాస్తిగారి సమక్షంలో తన వంటిమీదున్న నగలని ప్రధాన మంత్రి సహాయ నిధికి దానమిచ్చారు. ఆమె సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చయ్యేది. అందరినీ నమ్మేవారు.

అభిరుచులు....

ఆమెకి క్రికెట్ అన్నా, ఛెస్ అటలంటే ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ. పిల్లలని ప్రేమతో చూసుకునేవారు.
తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి తెలుగు సినీ సామ్రాజ్ఞి. సినీ జీవితంలో అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినా,నిజ జీవితంలో అతిఘోరంగా విఫలమైయ్యరు. చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె జీవిత చరమాంకం అందరికీ ఒక పాఠం. ఆమె నటజీవితం ఎందరో నటీమణులకి మార్గదర్శకం