28, జూన్ 2011, మంగళవారం

సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా బలమైన జాతిని నిర్మించిన స్టాలిన్

రష్యాలో సోషలిస్ట్ విప్లవం వచ్చినప్పుడు  తొలినాళ్లలో విప్లవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ చక్రవర్తుల అనుకూల వర్గంవాళ్లు తిరిగుబాటు చేశారు. ఆ సమయంలో ప్రతిరోధక శక్తులకి సామ్రాజ్యవాద దేశాలు మద్దతు ఇచ్చాయి.  బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రతిరోధక శక్తులకి మద్దతుగా తమ సైన్యాలని పంపాయి. అది వరకు మొదటి ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా బాగా నష్టపోయిన సామ్రాజ్యవాదులకి కొత్తగా రష్యాపై దాడి చెయ్యడం  పెద్ద ఖర్చు వ్యవహారమనిపించింది. దాంతో సామ్రాజ్యవాదులు రష్యా నుంచి తమ సైన్యాలని ఉపసంహరించుకున్నారు. సామ్రాజ్యవాదులు రష్యాపై ఎప్పటికైనా తిరిగి దాడి చేస్తారని స్టాలిన్ ముందే ఊహించాడు. సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా దేశాన్ని సంసిద్ధం చెయ్యాలంటే దేశాన్ని ఆర్థికంగా బలపరచాలి. దేశాన్ని ఆర్థికంగా బలపరచాలంటే దేశాన్ని పారిశ్రామీకరించాలి, వ్యవసాయాన్ని కూడా సమిష్టీకరించాలి. వ్యవసాయాన్ని సమిష్టీకరించడానికి అక్కడి మధ్య తరగతి రైతులు ఒప్పుకోలేదు. ప్రభుత్వం ఆ రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కుని వాటిని సమిష్టీకరించాల్సి వచ్చింది. తిరుగుబాటు చేసిన రైతుల్ని అరెస్ట్ చేయ్యడం లేదా పార్టీ కార్యకర్తల సహాయంతో బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. 1927 తరువాత రష్యాలో వేగంగా పారిశ్రామీకరణ, వ్యవసాయ సమిష్టీకరణ జరిగాయి. 1933లో రష్యాలోని పారిశ్రామీకరణ చూసి సామ్రాజ్యవాద దేశాలన్నీ భయపడ్డాయి. అదే సమయంలో జెర్మనీలో తీవ్రమైన anti-communist inclinations కలిగిన నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. రష్యాపై దాడి చేసే పని నాజీ సామ్రాజ్యవాదులు చూసుకుంటారని ఇతర సామ్రాజ్యవాద దేశాలు అనుకున్నాయి. నిజానికి నాజీ నియంత హిట్లర్ కంటే తీవ్రమైన anti-communist inclinations ఉన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాద నాయకుడు విన్స్టన్ చర్చిల్. అతను విప్లవ ప్రభుత్వాలని పురిట్లోనే చంపెయ్యాలని వాదించేవాడు. హిట్లర్ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రభావంతో సామ్రాజ్యవాదిగా ఎదిగాడు కానీ తన ఎదుగుదలని ప్రభావితం చేసిన బ్రిటిష్ సామ్రాజ్యం పైనే దాడి చెయ్యాలనుకున్నాడు. చివరికి హిట్లర్‌ని ఓడించడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు స్టాలిన్‌తో చేతులు కలపాసి వచ్చింది. 1940 నాటికి రష్యాలో విప్లవ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించింది. నిరుద్యోగాన్ని పూర్తిగా మాయం చేసింది. 1933 సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 20 నుంచి 30 శాతం నిరుద్యోగం ఉండేది. తమ దేశంలో విప్లవం రాకుండా ఉండేందుకు USA పాలక వర్గం కూడా నిరుద్యోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. నాజీ సైన్యాలు USAపై కూడా దాడి చెయ్యడంతో USA కూడా రెండవ ప్రపంచ యుద్ధంలోకి దిగి నాజీ కూటమిలో భాగమైన జపాన్‌పై దాడి చేశాయి. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. రష్యా గెలిచింది కానీ నాజీ బాంబు దాడులకి రష్యా కూడా ఆర్థికంగా నష్టపోయింది. నాజీలు ఫాక్టరీలతో పాటు వ్యవసాయ క్షేత్రాలపై కూడా బాంబులు వేశారు. 1940లో ప్రపంచంలోని 40% వ్యవసాయ ఎగుమతులు రష్యా నుంచే జరిగేవి. వ్యవసాయ క్షేత్రాలు బాంబు దాడుదలలో ద్వంసం కావడంతో వ్యవసాయ ఎగుమతులు భారీగా క్షీణించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత టైమ్‌లో సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లలో 80% మంది ప్రజలు పట్టణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు. అప్పటికీ USAలో పట్టణీకరణ 64% దాటలేదు.  సోవియట్ సమాఖ్యలోని ఉత్తర రిపబ్లిక్‌లు USA కంటే వేగంగా పట్టణీకరణ చెందాయి కానీ దక్షిణ రిపబ్లిక్‌లు వ్యవసాయంపై భారీగా ఆధారపడ్డాయి. తజికిస్తాన్ రిపబ్లిక్‌లో పట్టణీకరణ కేవలం 33% ఉండేది. తుర్క్‌మెనిస్తాన్ రిపబ్లిక్‌లో ఎడారి భూములు ఎక్కువగా ఉండడంతో అక్కడ భారీ పరిశ్రమలు పెట్టలేకపోయారు. స్టాలిన్ రష్యాని పారిశ్రామీకరించినప్పటికీ ప్రాంతీయ అసమానతలని నిర్మూలించలేకపోయాడు. ఒకప్పుడు కజక్‌స్తాన్ ప్రాంతంలో పశువులని పోషించుకుంటూ, జంతువులని వేటాడుకుంటూ తిరిగిన సంచార జాతుల వారికి  స్థిర నివాసాలు కల్పించడం జరిగింది కానీ వారు ఇప్పటికీ తమ సంప్రదాయమైన వేట మానలేదు. సాంస్కృతికంగా కూడా దక్షిణ రిపబ్లిక్‌లు వెనుకబడి ఉండేవి. దక్షిణ రిపబ్లిక్‌లు ఆర్థికంగా & సాంస్కృతికంగా వెనుకబడి ఉండడంతో 1990లో సోవియట్ సమాఖ్యని విచ్ఛితి చెయ్యడం సాధ్యమయ్యింది. సోవియట్ సమాఖ్య విచ్ఛిన్నమైనా ఆ సమాఖ్య సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహంలా గర్జించింది అనే విషయాన్ని మర్చిపోలేము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి