11, అక్టోబర్ 2011, మంగళవారం

రెండు చపాతీల కోసం అశుద్ధాన్ని చేతితో ముట్టుకునే దుస్థితిలో గుజరాతీ పాకీ పనివాళ్ళు

గుజరాత్ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందనీ, గుజరాత్‌లో అవినీతి లేదనీ గుజరాత్ పాలనని వీరోచితంగా పొగిడేస్తున్నారు కొందరు కార్పొరేట్ మీడియావాళ్ళు. గుజరాత్‌లోని దామాపూర్ గ్రామంలో ఐదు వాల్మీకీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి చెందిన ఎనిమిది మంది మహిళలు లెట్రిన్‌లు కడిగే వృత్తిలోనే ఉన్నారు. వాళ్ళు నూటపదిహేను కుటుంబాలకి చెందిన లెట్రిన్‌లు కడుగుతారు. ఆ కుటుంబాలు ముస్లింలు, ఠాకూర్‌లు & బ్రాహ్మణులకి చెందినవి. ఈ నూటపదిహేను కుటుంబాలకి చెందినవాళ్ళకి తమ లెట్రిన్‌లు తాము శుభ్రం చేసుకోవడానికే అసహ్యం కలిగినప్పుడు వీళ్ళ లెట్రిన్‌లని శుభ్రం చెయ్యడానికి ఇతరులకి ఎంత అసహ్యం కలగాలి? ఈ లింక్ చదవండి:http://www.countercurrents.org/rawat210311.htm ఎవరి అశుద్ధాన్ని వాళ్ళే కడుక్కోవాలని తెలియనివాళ్ళు నాగరిక సమాజంగా చెప్పుకునే సమాజంలో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదా? తెల్ల చొక్కా వేసుకున్న డబ్బున్నవాడు రోడ్డు పక్కన పేడ చూస్తేనే అసహ్యపడిపోతాడు. అటువంటప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి ఉపయోగించిన లెట్రిన్‌లో చెయ్యి పెట్టాలంటే ఇంకెంత అసహ్యం కలగాలి? పాకీవాళ్ళూ మనుషులే కానీ బతకడానికి వేరే దారి లేక రెండు చపాతీల కోసం అశుద్ధాన్ని ముట్టే స్థితిలో ఉన్నారు. ఇంకో విచిత్రమేమిటంటే తమది స్వేచ్ఛాసహోదరత్వవాద మతం అని చెప్పుకునే ముస్లింలు పాకీ వృత్తిని సమర్థించడం! ఇంత అనారోగ్యకరమైన వాతావరణంలో స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది, సహోదరత్వం అనే పదానికి అర్థం ఎక్కడ ఉంటుంది?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి