22, సెప్టెంబర్ 2010, బుధవారం

ఆ పాత మధురమూ ....

ఆ పాత మధురమూ ....

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే
మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే

ఆ పాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము
శ్రీ భారతి క్షీరసంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము
సరిగమ స్వరధుని సార వరూధిని శ్యామ సునాద వినోదిని
సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసినీ
మాం పాహి మకరంద మందాకినీ మాం పాహి సుజ్ఞాన సంవర్ధినీ
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే

ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా స్తన్యము
సారస్వతాక్షర సారధ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము
సరస వచోఘ్రణి సార సలోచని వాణీ పుస్తక ధారిణీ
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణి
మాంపాహి సాలోక్య సంధాయిని మాంపాహి శ్రీ చక్ర సింహాసిని
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే
మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే


ఈ పాట విన్నప్పుడల్లా ఏవేవో లోకాల్లోకి వేలిపోతుంటాను
నిజంగా ఆ పాత దనం మధురమే
ఆ పాత పాటలూ మధురమే
నాకు తెలిసనంత వరకూ ఈ రెహ్మాన్ గట్రా ల సంగీతం ఆ పాత మధురాల ముందు ఎందుకూ పనికిరాదు
ఇప్పటి సంగీత వాద్యాలు ముఖ్యంగా ఏ ఆర్ రహ్మాన్ వంటి వాళ్ళు ఉపయోగించే వాటి నుండి సంగీతం రప్పించడం
పెద్ద కష్టమేం కాదు
ఇవే వాద్యాలు అన్నమయ్య త్యాగయ్య మున్నగు వారి వద్ద ఉంటే ఇంకేమైనా చెప్పాలా?
తన జీవిత కాలంలో అన్నమయ్య ౩౨,౦౦౦ (ముప్పై రెండు వేల) కీర్తనలు రచించారు, రచిమ్చాతమేనా స్వరపరిచారు కూడా
మరి మనం ఆ ౩౨,౦౦౦ ఎందుకు మన ముందరి తరాలకు అందించలేక పోతున్నాము ?
మిగతా దేశాలు మనల్ని చూసి గర్వపడతారు మనమేదో మన సంస్కృతి ని ఏదో కాపాడేస్కుంటన్నామని
మరి కనీసం ఆ ఒక్క కారణం వల్లైనా మనం మన సంస్కృతీ ని గౌరవిద్దాం
ప్రతీ పండక్కీ కనీసం ఒక సంకీర్తనో లేక పలు శతకాలో నెమరు వేస్కుని మన బ్రతుకులు సార్థకం చేసుకుందాం
గమనించండి ఈ అవకాశం వేరే భాషల వారికి ఉండదు
ఒక కొత్త సంప్రదాయాన్ని మనమే మొదలు పెడదాం
పాడలేక పోతే కనీసం రికార్డింగ్ అయినా ప్లే చేయండి
మరియు మీ పిల్లలను ఈ తరహా పాటలు పాడటానికి ప్రోత్సహించండి
మొన్నామధ్య మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఒక పాట పాడుతోంది గమనిస్తే మొదట బాగానే ఉంది గానీ చివరకు అనుపల్లవి పాడే సరికీ నేను ఖంగు తిన్నాను
"వేర్ ఇస్ మై తాళి మై లైఫ్ ఇస్ ఖాళీ ఖాళీ" అంట
ఆ నోటా ఈ నోటా ఈ పదాలు చేర వలసిన చెవులకి చేరతాయని ఆశిస్తున్నా ,..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి