23, మార్చి 2011, బుధవారం

ఈ భోగ విలాసాలని త్యజించలేమా?


వేసవిలో పల్లెటూర్లకి వెళ్లాలంటే నాకు భయం. పల్లెటూర్లలోనైనా, పట్టణాలలోనైనా ఆ టైమ్‌లోనే కాలుష్యం ఎక్కువ ఉంటుంది. పెళ్లి భోజనాలు చేసి ఆకులు, పేపర్ ప్లేట్‌లు రోడ్ పక్కన పడేస్తారు. వాటి నుంచి కంపు వాసన వస్తుంది, ఈగలూ బాగా వ్యాపిస్తాయి. ఒక వైపు ధరలు పెరిగిపోయి పేదవాళ్లు కడుపుకి సరిపడా తిండితిప్పలు లేక బతుకుతున్నా ఈ దేశంలో ధనవంతులకి బాసుమతి బియ్యం లాంటి ఖరీదైన రకాల బియ్యాలకి కరువు లేదు. కూలీవాడు పది రూపాయలు కూలీ ధర పెంచమంటే పెంచడానికి సంకోచిస్తారు కానీ పెళ్లిళ్లకి, శ్రాద్ధకర్మలకి వేలు, లక్షలు ఖర్చు పెట్టడానికైతే సంకోచం ఉండదు, అదీ పర్యావరణ కాలుష్యంలో పాలుపంచుకుంటూ. పల్లెటూర్లలో sanitation సౌకర్యాలు తక్కువ. పెళ్లికి వచ్చిన అతిథులు భోజనాల తరువాత చెరువులు, కాలువ గట్ల దగ్గర మల విసర్జనలు చేసి వేసవిలో మిగిలిన కొద్దిపాటి నీళ్లని కలుషితం చేస్తారు. పట్టణ ప్రాంతాలలో పిల్లలకి జరిపే బర్త్ డే పార్టీలు కూడా నా దృష్టిలో అనవసరమే. ఆ డబ్బులతో అనాథ పిల్లలకి పండ్లు దానం చెయ్యొచ్చు. అలా చెయ్యాలని లేకపోతే మన పిల్లల పేరుతో బ్యాంక్‌లో చైల్డ్ సేవింగ్స్ అకౌంటైనా తెరవచ్చు. అంతే కానీ వ్యక్తిగత గొప్పలు ప్రదర్శించుకునే భోగ విలాసాలు నాకు నచ్చవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి