27, నవంబర్ 2010, శనివారం

    మహత్తర జీవిత కాంక్ష

ఇది చాలా పాత కథ.
చైనా లోని మారుమూల ప్రాంతం అది. అక్కడో పచ్చని పల్లెటూరు… ఆ పల్లె చుట్టూ ఎత్తైన కొండలు. ఆ ఊర్లో వారు ఏదైనా తెచ్చుకోవాలంటే
ఆ కొండల చుట్టూ తిరిగి వేళ్ళాల్సిందే. నిటారుగా ఉన్న ఆ కొండల్ని ఎక్కడం సాధ్యం కాని పని. కొండల్ని చుట్టి వెళ్ళడానికి వారం రోజులు పట్టేది.
మరో మార్గం లేదు. ఇలా తరతరాలు గతించి పోయాయి. ఓ రోజు ఓ వృధ్ధుడు పలుగూ, పార భుజాన వేసుకుని బయలుదేరాడు.
ఊళ్ళోని యువకులు 'ఎక్కడికెవెళ్తున్నవ్ పెద్దయనా..' అని అడిగారు. ఏంలేదు నాయనలారా ఆ కొండల్ని తవ్వుదామనీ.. అని సమాధానమిచ్చాడు. ఫక్కుమని నవ్వారు ఆకుర్రాళ్ళు. . తాత పట్టించుకోలేదు. సాగిపోయాడు ముందుకు. ఆ నాటి నుంచి వృధ్ధుడు రోజూ వెళ్తున్నాడు. వస్తున్నాడు. ఓ రోజు చీకటి పడ్డా తాత తిరిగి రాలేదు. ఏమయ్యాడో ముసలోడు అంటూ ఊరిజనం లాంతర్లు తీసుకుని కొండ దగ్గరకు వెళ్ళారు.తవ్వుతూ తవుతూ పలుగు, పార పైనే వొరిగిపొయి వున్నడు తాత . ప్రాణం లేని ఆయన శరీరం బిర్రబిగుసుకునివుంది. నాలుగైదు అడుగులు మేర కొండ చదనైపోయింది. జనం హృదయాంతరాళం లో ఏదో కొత్త ఆశను నింపింది. కాటికి కాలు చాపిన ముసలాడే కొంత కొండను తవ్వేసాడు. మనమంతా తలో చేయి వేస్తే కొండ కరగదా అనే ధీమా పెల్లుబికింది. మర్నాటి నుంచే ఇంటి కో మనిషి వెళ్ళి కొండను తవ్వ సాగారు.

కొన్నాళ్ళకు కొండ కరగి పోయింది. చక్కటి దారి ఏర్పడింది.
ప్రస్తుత రాజకీయాలు సామాన్యుడు అధిగమించడానికి ఆ కొండల్లాగే అసాధ్యం గా కనిపిస్తున్నాయి.ఎంత పెద్ద కొండ నైనా చీల్చ గలిగేది
గడ్డ పారే కదా! కష్టే ఫలీ..

వేయిమైళ్ళ పయనమైనా ప్రారంభమయ్యేది ఒక అడుగు తోనే కదా !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి